జేఎన్‌యూ దాడి: అమిత్ షా సీరియస్, ఉపేక్షించేది లేదంటూ హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను కేంద్ర హోంమంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది. విద్యార్థుల దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర హోంతమంత్రి అమిత్ షా.. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
అమిత్ షా హెచ్చరిక
దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో ఇప్పటికే ఆయన మాట్లాడారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని తేల్చి చెప్పారు. ఘటనపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
ముసుగులతో వచ్చి దాడులు..
కాగా, జేఎన్‌యూలో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వర్సిటీలోని సబర్మతితోపాటు మరికొన్ని వసతి గృహాల్లోకి చొరబడి విద్యార్థులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జేఎన్ యూ సంఘం నేత ఐషే ఘోష్‌కు తీవ్రగాయాలయ్యాయి. మాస్కులు ధరించిన వ్యక్తులు తనను తీవ్రంగా గాయపర్చారని ఆయన ఆరోపించారు.

కర్రలు, రాడ్లతో దాడులు..
ఏబీవీపీ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారంటూ జేఎన్ యూఎస్ యూ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రొఫెసర్లపైనా దాడి చేశారని చెబుతున్నారు. వసతి గృహంపై రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. సుమారు 50మంది మాస్కులు ధరించి దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వారి చేతిలో కర్రలు, రాడ్లు ఉన్నాయని తెలిపారు.
ఉద్రిక్త పరిస్థితులు..
ఈ దాడితో జేఎన్ యూలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. దాడిని నిరసిస్తూ పలువురు విద్యార్థులు పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. కాగా, విద్యార్థులపై జరిగని దాడిని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. పోలీసులు వెంటనే వర్సిటీలో శాంతి వాతావరణ నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతోపాటు వామపక్షాలు కూడా విద్యార్థులపై జరిగిని దాడి ఘటనను ఖండించారు.












Click it and Unblock the Notifications