వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘రాజకీయ నేతలూ ఎదగండి’: జేఎన్‌యూపై గంభీర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జేఎన్‌యూలో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో విద్యార్థులు చేపట్టిన నిరసనపై ఒలింపిక్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ అసంతప్తి వ్యక్తి చేసిన అనంతరం సీనియర్ భారత క్రికెటర్ గౌతం గంభీర్ కూడా తీవ్రంగా స్పందించారు. జాతి వ్యతిరేక నినాదాలు చేస్తున్న వారికి మద్దతు తెలుపుతున్న రాజకీయ నాయకులు ఎదగాలని సూచించారు.

‘జేఎన్‌యూ, జాదవ్‌పూర్ యూనివర్సిటీలలో వీడియోలు దిగ్ర్భాంతికి గురిచేశాయి. రాజకీయ నాయకులు ఎదగాలి. దీన్ని రాజకీయం చేయొద్దు. అందరం మదర్ ఇండియా కోసం కలిసి ఉండాలి. అధికారంలోకి వచ్చేందు కోసం దేశ సమగ్రతలో రాజీపడొద్దు' అని గౌతం గంభీర్ ట్వీట్ చేశారు.

JNU stir: Now, Gautam Gambhir asks politicians to 'grow up'

ఇంతకుముందు రెజ్లర్ యోగేశ్వర్ దత్ కూడా జేఎన్‌యూ వివాదంపై తీవ్రంగా స్పందించారు. పార్లమెంటుపై దాడికి ప్రయత్నించిన ఉగ్రవాది అఫ్జల్ గురు అమరవీరుడైతే.. దేశం కోసం ప్రాణాలర్పించిన లాన్స్ నాయక్ హనుమంతప్ప ఎవరు? అని ప్రశ్నించారు. అంతేగాక, దేశభక్తిపై ఆయనొక పద్యం కూడా రాశారు.

కాగా, పార్లమెంటుపై దాడికి ప్రయత్నించిన కేసులో నిందితుడైన అఫ్జల్ గురును, జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ సహ వ్యవస్థాపకుడు మక్బుల్ భట్‌ల ఉరికి నిరసనగా ఫిబ్రవరి 9న పలువురు విద్యార్థులు జేఎన్‌యూలో భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు. దేశద్రోహం కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు ఇతనికి మార్చి 2 వరకు కస్టడీ విధించింది.

English summary
A day after Olympian wrestler Yogeshwar Dutt expressed disappointment over ongoing protest in JNU over freedom of speech, now senior India cricketer Gautam Gambhir has slammed the politicians and asked them to grow up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X