అమిత్ షా సభకు రూ.100 ఇచ్చి మహిళల తరలింపు-అడిగిన జర్నలిస్టుపై బీజేపీ శ్రేణుల దాడి..!

ఉత్తర్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీలో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక్కడ పర్యటిస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టు రాఘవ్ త్రివేదీపై దాడికి పాల్పడ్డారు. జర్నలిస్టు తమను ప్రశ్నించడంతో ఉక్రోషం ఆపుకోలేక వారు ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. దాడిలో జర్నలిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి.

అమిత్ షా ర్యాలీకి వచ్చేందుకు స్థానిక మహిళలకు బీజేపీ నేతలు రూ.100 చొప్పున పంచారు. అయితే ఈ విషయం తెలిసి జర్నలిస్టు రాఘవ్ త్రివేదీ అక్కడికి వెళ్లి మహిళలను అడిగారు. దీంతో వారు తమకు రూ.100 చొప్పున ఇచ్చి రప్పించారని, తమకు అమిత్ షా ఎవరో తెలియదన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ నేతల వద్దకు వెళ్లి జర్నలిస్టు రాఘవ్ త్రివేదీ ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తులైన బీజేపీ కార్యకర్తలు ముందు ఆ మహిళలు చెప్పిన మాటల వీడియోను తొలగించాలని ఆదేశించారు.

journalist attacked at Rae bareli amit shah rally for questioning bjp for distributing rs 100 each

అయితే జర్నలిస్టు రాఘవ్ ఇందుకు నిరాకరించడంతో ఆయనపై దాడికి దిగారు. తొలుత వారు తామెలాంటి తప్పూ చేయలేదని బుకాయించారని, కానీ తాను మహిళల మాటలు రికార్డు చేశారని చెప్పడంతో తనను ఏకాంత ప్రదేశానికి లాక్కెళ్లారని, అక్కడ రికార్డ్ చేసిన వీడియోను డిలీట్ చేయాలని కోరారని, దానికి తాను నిరాకరించడంతో తీవ్రంగా దాడి చేశారని జర్నలిస్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. సాయం కోసం తాను అరిచినా పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. దాడి తర్వాత స్పృహలోకి వచ్చినప్పుడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+