ఆర్యన్ ఖాన్ కు షూరిటీ ఇచ్చిన జూహీ చావ్లా; ఆర్యన్ కోసం షారూక్ కుటుంబం, ఫ్యాన్స్ !!
బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్ కు ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్యన్ ఖాన్ ను జైలు నుండి బయటకు తీసుకు రావడానికి లాయర్ల బృందం ఫార్మాలిటీస్ ను పూర్తి చేస్తుంది. బెయిల్ షరతులను బాంబే హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత, షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కోసం లక్ష రూపాయల బాండ్‌పై సంతకం చేయడానికి నటి జుహీ చావ్లా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) కోర్టుకు చేరుకుని షూరిటీ ఇచ్చారు.
ఆర్యన్ ఖాన్ కు జూహీ చావ్లా షూరిటీ
బాలీవుడ్ బాద్ షా, షారుఖ్ ఖాన్‌కు సన్నిహితురాలు, షారుక్ ఖాన్ తో కలిసి పలు చిత్రాలలో నటించిన జూహీ చావ్లా , ఆర్యన్ ఖాన్‌కు ష్యూరిటీగా ఉన్నారు. ఆర్యన్ ఖాన్ యొక్క న్యాయవాది సతీష్ మానేషిండే మాట్లాడుతూ, జూహీ చావ్లాకు ఆర్యన్ ఖాన్ పుట్టినప్పటి నుండి తెలుసు. అలాగే వృత్తిపరంగా సంబంధం కూడా ఉందని పేర్కొన్నారు. బాంబే హైకోర్టు శుక్రవారం ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసి, షరతులను విడుదల చేయడంతో, ఆర్యన్ తరపు న్యాయవాదులు ఈ రోజు ఆర్యన్ ఖాన్ ను జైలు నుండి బయటకు వచ్చేలా చూడాలని ప్రయత్నం చేస్తున్నారు.

ఆర్యన్ ఖాన్ కు 14 బెయిల్ షరతులను విధించిన కోర్టు
ఆర్యన్ ఖాన్ బెయిల్ షరతులలో ఆర్యన్ ఖాన్ ప్రతి శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయానికి రిపోర్టు చేయవలసి ఉంది. అలాగే ఆర్యన్ ఖాన్ తన పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలి. మొత్తం 14 బెయిల్ షరతులు విధించిన కోర్టు ఆ షరతుల మేరకే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసింది. బాంబే హైకోర్టు ఆర్డర్ లో భాగంగా ష్యూరిటీల వంటి ఇతర లాంఛనాలను పూర్తి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మా న్యాయ బృందం దానిపై పని చేస్తోంది. ఈరోజు ఆర్యన్ ఖాన్ ను విడుదల చేయించటానికి ప్రయత్నిస్తున్నామని ఎన్డీపీఎస్ కోర్టులో మానేషిండే చెప్పారు.
ఎన్డీపీఎస్ కోర్టులో జూహీ చావ్లా షూరిటీ పత్రాలు
బెయిల్ షరతులు వచ్చిన తర్వాత ఆర్యన్ ఖాన్‌కు పూచీకత్తుగా నటి జూహీ చావ్లా కోర్టును ఆశ్రయించారు. మానేషిండే ఆర్యన్ ఖాన్ యొక్క ష్యూరిటీని సమర్పించగా, జూహీ చావ్లా సాక్షిగా మారారు. ఎన్‌డిపిఎస్ కోర్టు జూహీ చావ్లా షూరిటీ పత్రాలను ధృవీకరించిన తర్వాత, మిగిలిన ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి ఆమె డిపార్ట్‌మెంట్‌కు వెళ్ళారు. ఆపై ఆర్యన్ ఖాన్ కు జుహీ చావ్లా యొక్క పూచీకత్తు అంగీకరించబడిందని మానషిండే వెల్లడించారు. త్వరలో ఆర్యన్‌ని చూస్తారని పేర్కొన్నారు.
ఆర్యన్ కోసం ఎదురు చూస్తున్న షారూక్ కుటుంబం ... ఫ్యాన్స్
మరోపక్క ఆర్యన్ ఖాన్ కోసం తల్లి గౌరీ ఖాన్, తండ్రి షారూక్ ఖాన్ ఎదురు చూస్తున్నారు. సోదరి సుహానా, సోదరుడు సైతం నిరీక్షిస్తున్నారు. నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు, ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, అతని స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో ఆర్యన్ కు బెయిల్ మంజూరు చెయ్యటంపై ధన్యావాదాల పోస్ట్ లను పంచుకున్నారు. షారుఖ్ తన లాయర్ల బృందంతో కలిసి ఫోటోలు దిగారు. ఆర్యన్ సోదరి సుహానా ఖాన్ కూడా ఆర్యన్ మరియు షారూక్ ఖాన్ తో కలిసి ఉన్న మోనోక్రోమ్ ఫోటోలను షేర్ చేసింది. షారూఖ్ స్నేహితుడు మరియు చిత్రనిర్మాత కరణ్ జోహార్ కూడా హార్ట్ ఎమోజీతో వారిద్దరి ఫోటోను పంచుకున్నారు. ఆర్యన్ శుక్రవారం జైలు జీవితం నుండి స్వేఛ్చ పొందుతారని అంతా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications