Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాళ్ల తలలు పగలగొట్టండి-లాఠీ తీసుకుని ఉతికేయండి-హర్యానాలో రైతుల పట్ల అధికారి కఠిన ఆదేశాలు

'వాళ్ల తలలు పగలగొట్టండి...' అంటూ హర్యానాలోని కర్నాల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పాల్గొనబోయే సమావేశాన్ని అడ్డుకునేందుకు రైతులు యత్నిస్తే... వారి తలలు పగలగొట్టాలని ఆ అధికారి పోలీసులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బారికేడ్లు దాటనివ్వొద్దని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

పోలీసులతో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఏమన్నారంటే..

పోలీసులతో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఏమన్నారంటే..

'ఇది చాలా సింపుల్ అండ్ క్లియర్.అతనెవరైనా,ఎక్కడి నుంచి వచ్చినా... ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గీత దాటనివ్వొద్దు. ఒకవేళ బారికేడ్లు దాటి ప్రయత్నం చేస్తే... లాఠీ తీసుకుని ఉతికేయండి. ఇది చాలా క్లియర్... వారిని గట్టిగా చితకబాదండి. ఒక్క నిరసనకారుడు ఇక్కడికి చేరుకున్నా సరే... అతని తల పగలగొట్టడం నేను చూడాలి... వాళ్ల తలలు పగలగొట్టేయండి.' అని ఆయుష్ సిన్హా పోలీసులతో చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. చివరలో 'ఎనీ డౌట్' అని సిన్హా అనగా... 'నో సార్...' అంటూ పోలీసులు బదులిచ్చారు.

ఇది నిజమే అయితే... : వరుణ్ గాంధీ రియాక్షన్

బీజేపీ నేత వరుణ్ గాంధీ దీనిపై ట్విట్టర్‌లో స్పందించారు.'ఈ వీడియో ఎడిట్ చేయబడిందని నేను అనుకుంటున్నాను. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరు. ఒకవేళ చేసి ఉంటే అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రజాస్వామ్య దేశంలో సొంత పౌరుల పైనే ఇలాంటి చర్యలు సరైనవి కాదు.' అని అభిప్రాయపడ్డారు.సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా స్పందిస్తూ... నిరసనకారులు చాలా చోట్ల రాళ్ల దాడులకు పాల్పడ్డారని.. ఆ క్రమంలో పోలీసులతో మాట్లాడుతూ సందర్భాన్ని బట్టి వ్యవహరించాలని చెప్పినట్లు తెలిపారు.

తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్...

తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్...

కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. 'ఖట్టర్ సాబ్... ఇవాళ మీరు రైతులపై లాఠీలు జులిపించారు. చిందిన రైతుల రక్తాన్ని రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి.' అని పేర్కొన్నారు. హర్యానా పోలీసుల అసలు స్వరూపం బయటపడిందని స్వరాజ్ ఇండియా చీఫ్,ఎస్‌కేఎం కీలక నేత యోగేంద్ర యాదవ్ అన్నారు.శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.

10 మంది రైతులకు గాయాలు...

10 మంది రైతులకు గాయాలు...

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాల రద్దుకై రైతులు పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నాల్‌లో శనివారం(ఆగస్టు 28) ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొనబోయే సమావేశాన్ని అడ్డుకుని తమ నిరసన తెలియజేయాలని రైతులు భావించారు. ఇందుకోసం ఘరౌండా టోల్‌ప్లాజా వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు.

కిలో మీటర్ల మేర హైవేను దిగ్బంధించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా... పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో దాదాపు 10 మంది రైతుల తలలు పగిలాయి.రక్తమోడుతున్న రైతుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రైతులపై లాఠీచార్జికి నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) రాష్ట్రవ్యాప్తంగా హైవేల దిగ్బంధానికి పిలుపునిచ్చింది. దీంతో ఎక్కడికక్కడ రైతులు హైవేల పైకి చేరుకుని రోడ్లను దిగ్బంధించారు.

రాహుల్ గాంధీ రియాక్షన్...

రైతులపై పోలీసుల లాఠీచార్జిని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై లాఠీ చార్జి చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రైతుల రక్తం చిందేలా వారిపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. రక్తసిక్తమైన దుస్తులతో ఉన్న ఓ రైతు ఫొటోను రాహుల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.హర్యానా కాంగ్రెస్ చీఫ్ కుమారి షెల్జా కూడా రైతులపై పోలీసుల దమనకాండను ఖండించారు.అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+