సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం అయ్యారు. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకాన్ని ధృవీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ సంజీవ్ ఖన్నాను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం పట్ల కేంద్ర న్యాయ మరియు న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సంతోషం వ్యక్తం చేశారు.

జస్టిస్ ఖన్నా నవంబర్ 11న భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ఏడు నెలల పాటు ఉన్నత న్యాయమూర్తి స్థానంలో బాధ్యతలను నిర్వర్తించనున్నారు. మే 13, 2025 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా పని చేయనున్నారు. పదవీకాలం ముగిసిన CJI DY చంద్రచూడ్ ..జస్టిస్ ఖన్నా పేరును సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో సంజీవ్ ఖన్నాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేయడం జరిగింది.చంద్రచూడ్ తర్వాత అత్యంత సీనియన్ న్యాయమూర్తి కావడంతోనే సంజీవ్ ఖన్నాకు ఈ అవకాశం దక్కింది.

Justice Sanjiv Khanna appointed as next Chief Justice of India

చంద్రచూడ్ వారసుడిగా సంజీవ్ ఖన్నా ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఖన్నా జనవరి 18, 2019న ఢిల్లీ హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. పలు కీలక కేసుల్లో ఆయన భాగస్వామి అయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ బెయిల్ దరఖాస్తులకు సంబంధించి రాజకీయంగా సున్నితమైన అంశాలను జస్టిస్ ఖన్నా హయంలోనే పరిష్కరించపడ్డాయి. ఇక ఈవీఎం-వీవీపీఏటీ వ్యవహారంపై కూడా జస్టిస్ ఖన్నా నేతృత్వంలోనే విచారణ సాగింది. 100% VVPAT ధృవీకరణ కోసం చేసిన అభ్యర్థనను తిరస్కరిస్తూ, తీర్పు తదుపరి భద్రతలను ప్రవేశపెట్టాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించింది. ఆర్టికల్ 370 మరియు ఎలక్టోరల్ బాండ్స్ కేసులలో జస్టిస్ సంజీవ్ ఖన్నా రాజ్యాంగ బెంచ్ నిర్ణయాలలో కూడా భాగమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+