హత్య: నిందితుడికి పోలీసు ముద్దులు, కౌగిలింత

 Jyoti murder case: Kanpur cop transferred for kissing accused
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో జ్యోతి హత్య కేసులో ప్రధాన నిందితుడు పియూష్ శ్యామ్ దాసానిని పోలీసు సర్కిల్ ఆఫీసర్ (సిఓ) ముద్దు పెట్టుకున్నాడు, కౌగలించుకున్నాడు. దీంతో అతన్ని కాన్పూర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ బదిలీ చేశారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు హత్య కేసులో కేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి ప్రధాన నిందితుడిని, మృతురాలి భర్తను కాన్పూర్ పోలీసు స్టేషన్‌లో ఆలింగనం చేసుకున్నాడు.

విచారణ నిమిత్తం పోలీసులు పియూష్‌ను శుక్రవారంనాడు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మీడియా సమక్షంలో స్వరూప్ నగర్ పోలీసు స్టేషన్ సర్కిల్ ఆఫీసర్ ఆర్‌కె నాయక్‌ పద్దతులు మార్చుకుంటావా అని పియూష్ శ్యామ్ దాసానిని అడిగారు. దానికి అతను సానుకూలంగా స్పందించాడు.

దాంతో మంచి బాలుడివి అంటూ నాయక్ అతన్ని ఆలింగనం చేసుకుని, అతని నుదుటిపై ముద్దు పెట్టాడు. తన ప్రియురాలి కారు డ్రైవర్ సాయంతో పియూష్ తన భార్యను హత్య చేశాడనే ఆరోపణపై పోలీసులు అతన్ని జులై 31వ తేదీన అరెస్టు చేశారు. పియూష్ ప్రియురాలి డ్రైవర్ అధివేశ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+