జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్, అతని తల్లికి కూడా, ఆస్పత్రిలో చికిత్స..

బీజేపీ ముఖ్యనేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా వైరస్ సోకింది. అతనితోపాటు తల్లి మాధవి రాజే సింధియాకు కూడా పాజిటవ్ వచ్చింది. వీరిద్దరినీ దక్షిణ ఢిల్లీ సాకెట్ వద్ద గల మ్యాక్స్ ఆస్పత్రిలో చేర్చించారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో నాలుగురోజుల క్రితం సింధియా ఆస్పత్రిలో చేరాడు. సింధియాకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని బీజేపీ నేతలు ధృవీకరించారు.

ఇదివరకు బీజీపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా కూడా కరోనావైరస్ సోకింది. అతను గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఆయన నిన్న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్వరం, గొంతులో నొప్పి రావడంతో మంగళవారం ఉదయం కరోనా వైరస్ పరీక్షలు చేశారు. కానీ రిపోర్ట్ రావాల్సి ఉంది.

Jyotiraditya Scindia and mother test positive for coronavirus..

గత మార్చిలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో జ్యోతిరాదిత్య సింధియా చేరారు. తన వర్గం ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో మధ్యప్రదేశ్‌‌లో అధికారం చేతులు మారింది. ఇందుకు ప్రతీగా సింధియాకు కేంద్రమంత్రి పదవీ ఆఫర్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ శివరాజ్ సింగ్ ప్రభుత్వ తీరుతో సింధియా గుర్రుగా ఉన్నారు. ఇటీవల తన ట్వీట్టర్ ఖాతా ప్రొఫైల్‌లో బీజేపీ ఇమేజీ తీసివేయడంతో దుమారం చెలరేగింది. కానీ నిజం కన్నా అబద్దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని సింధియా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు కూడా కాంగ్రెస్ లోగో తీసివేశాక.. బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Recommended Video

    Sonu Sood Is BJP Face, Shiv Sena’s Sanjay Raut Targets Sonu Sood

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+