విషాదం కాదు, నరమేధం: యోగి ముగింపు పలకాలని కైలాష్ సత్యార్థి తీవ్ర స్పందన

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆస్పత్రిలో చిన్నారుల మృతి ఘటనపై నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్‌ సత్యార్థి తీవ్రంగా స్పందించారు. యూపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూపీలో 63కు చేరిన చిన్నారుల మరణాలు: యోగి సీరియస్, అసలేం జరిగింది?

'ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా లేని కారణంగా 30 మంది చిన్నారులు బలయ్యారు. ఇది విషాదం కాదు. నరమేధం. 70ఏళ్ల స్వాత్రంత్యం అంటే మన చిన్నారులకు చెప్పే అర్థం ఇదేనా..?' అంటూ ఘాటుగా ప్రశ్నించారు. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ జోక్యం చోసుకోవాలని కోరారు.

 Kailash Satyarthi calls Gorakhpur hospital deaths 'a massacre'

'సీఎం ఆదిత్యనాథ్‌ జీ.. ఈ ఘటనలో మీరు తీసుకునే నిర్ణయం దశాబ్దాలుగా అవినీతిమయమైన వైద్య వ్యవస్థను సరిచేయాలి. అప్పుడే ఇలాంటి ఘటన జరగకుండా ఉంటాయి' అని సత్యార్థి పేర్కొన్నారు.

గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ ఆస్పపత్రిలో గత ఐదు రోజుల్లో ఆక్సిజన్‌ సరఫరా అందక 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా, ఘటనపై ఇప్పటికే సీఎం ఆదిత్యనాథ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. వెంటనే ఆస్పత్రిలో ఆక్సిజన్ సరపరా చేయాలని ఆదేశించారు. ఆక్సిజన్ అందకపోవడంతోపాటు మరికొన్ని కారణాలతో చిన్నారులు మృతి చెందినట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nobel laureate Kailash Satyarthi has termed the tragic death of over 60 children in Gorakhpur's Baba Raghav Das Medical College as 'massacre'.
Please Wait while comments are loading...