Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ సీఎం జగన్‌కు కమల్ హాసన్ ధన్యవాదాలు - ఇది భారతీయుల కోరిక అంటూ ప్రశంస..

ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ధన్యవాదాలు చెప్పారు. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న అవార్డును ప్రధానం చేయాలంటూ ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం అభినందనీయమని కమల్ కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం ఓ లేఖను విడుదల చేశారు.

Recommended Video

    థాంక్యూ CM Jagan గారూ.. ఇది భారతీయుల కోరిక అంటూ Kamal Haasan ప్రశంస! || Oneindia Telugu
    kamal-haasan-thanks-ap-cm-jagan-for-recommending-spb-s-name-for-bharat-ratna

    ''గౌరవ ఏపీ సీఎం జగన్ గారూ.. మీకు నా ధన్యవాదాలు. మా సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను గౌరవించుకోవడం కోసం మీరు చేసిన విన్నపం నిజంగా సెంటిమెంట్ లాంటిదే. తమిళనాడులోనేకాదు, దేశమంతటా ఉన్న బాలు అభిమానులు దీనినే కోరుతున్నారు'' అని కమల్ హాసన్ తన లేఖలో పేర్కొన్నారు.

    kamal-haasan-thanks-ap-cm-jagan-for-recommending-spb-s-name-for-bharat-ratna

    గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు 'భారతరత్న' ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ సోమవారం ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు రాసిన లేఖలో.. సంగీతం, కళలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన సేవలకుగానూ ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని జగన్ కోరారు. ఐదు దశాబ్దాల మర్చిపోలేని సేవలు అందించిన ఆయనకు ఇది సముచిత గుర్తింపు అవుతుందని, గతంలో సంగీత దిగ్గజాలు లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎంఎస్ సుబ్బలక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీంసేన్ జోషి వంటివారికి సైతం భారతరత్న ఇచ్చిన విషయం జగన్ తన లేఖలో ప్రస్తావించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+