పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటికి కమల్ హాసన్: సాయంత్రం కరుణానిధితో భేటీ
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి విలక్షణ నటుడు కమల్ హాసన్ వెళ్లారు. ఆదివారం పోయెస్ గార్డెన్‌లోని రజనీ ఇంటికి కమల్ వెళ్లారు. తాను రజనీతో కలవనని ఇటీవలే చెప్పారు.

ఇప్పుడు రజనీ ఇంటికి వెళ్లారు. ఈ నెల 21వ తేదీన కమల్ పార్టీని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో తన పార్టీ ప్రకటన సభకు రావాలని ఆహ్వానించారు. ఇరువురు దాదాపు గంటసేపు భేటీ అయ్యారు.

తమ కలయికలో రాజకీయం లేదని, ఫ్రెండ్లీగా కలిశామని, తన పార్టీ ప్రకటన కోసం ఆహ్వానించానని కమల్ చెప్పారు. రజనీతో కలవడంపై టైం నిర్ణయిస్తుందని చెప్పారు. కమల్ ధనం, పేరు కోసం రావడం లేదని, ప్రజల కోసం వస్తున్నారని, తామిద్దరి దారులు వేరని, కానీ అంతిమంగా లక్ష్యం ఒక్కటేనని చెప్పారు. ఆ తర్వాత సాయంత్రం కమల్ హాసన్ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, ఆ పార్టీ కురువృద్దుడు కరుణానిధిని కలిశారు.












Click it and Unblock the Notifications