Kangana vs Uddhav:తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు..మహా సీఎంకు క్వీన్ స్ట్రాంగ్ వార్నింగ్
మహారాష్ట్రలో కంగనా వర్సెస్ ఉద్ధవ్‌గా పరిస్థితి మారింది. ఇప్పటికే ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్రలో బాలీవుడ్ డ్రగ్ మాఫియా టాపిక్ హాట్‌గా నడుస్తోంది. బాలీవుడ్ డ్రగ్ మాఫియాలో ఎవరెవరున్నారు, ప్రముఖులు ఎవరు వారి పేర్లను తప్పకుండా బయటపెడతానంటూ క్వీన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం అటు బాలీవుడ్‌ను షేక్ చేశాయి. అంతకుముందు ముంబైలోని కంగనా ఆఫీసును కూల్చేందుకు వీలు లేదని పేర్కొంటూ బాంబే హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో కంగనాకు భారీ ఊరట లభించినట్లయ్యింది.
Recommended Video
तुमने जो किया अच्छा किया 🙂#DeathOfDemocracy pic.twitter.com/TBZiYytSEw
— Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020
ఇక చండీగఢ్ నుంచి ముంబై విమానాశ్రయంకు చేరుకుంది కంగనా. అయితే ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విమానాశ్రయం బయట ఆమె మద్దతుదారులైన ఆమెకు అనుకూలంగా నినాదాలు చేయగా... శివసేన పార్టీ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నినాదాల మధ్యే కంగనా రనౌత్ తన సోదరి రంగోళితో కలిసి ఓ వాహనంలో ప్రత్యేక గేట్ ద్వారా ఇంటికి బయలుదేరి వెళ్లారు. ఆమెకు రక్షణగా వై-కేటగిరీ భద్రతా సిబ్బంది ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇంటికి చేరుకున్న కంగనా రనౌత్ ఓ వీడియోను ట్వీట్ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. తన ఆఫీసును కూల్చడాన్ని ఒక ఉగ్రవాద చర్యగా ఆమె అభివర్ణించారు. శివసేన పై తాను పోరాటం చేస్తున్నందునే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఫైర్ అయ్యారు. అంతేకాదు ఆఫీసును కూల్చినంత మాత్రాన తాను బెదిరేది లేదని తేల్చి చెప్పారు. తనను ఎంతగా ఇబ్బంది పెడితే అంతగా బౌన్స్ అవుతానని ఉద్ధవ్ థాక్రేకు వార్నింగ్ ఇచ్చారు. ఇక రోజులన్నీ ఒకేలా ఉండవని... ఈగోకు వెళ్లి వాస్తవాలను మాట్లాడేవారిని ఇబ్బందులకు గురిచేస్తే ప్రజలు ఉద్ధవ్ భరతం పడతారని హెచ్చరించారు. ప్రస్తుతం ముంబైలో పీఓకే తరహా వాతావరణం నెలకొందని ఘాటు వ్యాఖ్యలు చేశారు కంగనా.
#DeathOfDemocracy pic.twitter.com/pbLleNulYa
— Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020
తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదన్న కంగనా రనౌత్.. అయోధ్యపైనే కాదు కశ్మీరి పండిట్స్‌పై కూడా చిత్రం చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ రోజు కశ్మీరి పండిట్లు ఎంతగా ఆవేదనకు గురయ్యారో తనకు అర్థమైందని చెప్పారు. ఇక అదే సమయంలో తన ఆఫీసును కూల్చిన తర్వాత శిథిలాలను ఆమె ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications