నిరూపిస్తే.. ముంబైని శాశ్వతంగా వదిలేస్తా: మహా సర్కారుకు కంగనా రనౌత్ సవాల్
ముంబై: ప్రస్తుతం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వర్సెస్ మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం అన్నట్లు నడుస్తోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు నుంచీ రాష్ట్ర ప్రభుత్వంపై కంగన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో శివసేన ఎంపీలు, మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారు.
తాజాగా, కంగనాపై శివసేన మరో కొత్త ఆరోపణలతో ముందుకు వచ్చింది. కంగనాకు డ్రగ్స్ అలవాటు ఉందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. కంగనా తనను డ్రగ్స్ తీసుకోవాలని బలవంతం చేసినట్లు నటుడు అధ్యాయన్ సుమన్ గతంలో ఆరోపించిన వీడియోల ఆధారంగా హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ముంబై పోలీస్ విభాగానికి చెందిన యాంటీ నార్కోటిక్ విభాగం దీనిపై దర్యాప్తు చేస్తుందని మంత్రి దేశ్‌ముఖ్ తెలిపారు. తొలుత సుమన్‌కు విచారించనున్నట్లు చెప్పారు. కాగా, హోంమంత్రి వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే కంగనా రనౌత్ సర్కారుకు సవాల్ విసిరారు.

డ్రగ్స్ పరీక్షల కోసం సంతోషంగా తన రక్త నమూనాలు ఇస్తానని కంగనా చెప్పుకొచ్చారు. ఈ దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. తన కాల్ రికార్డులనూ దర్యాప్తు చేసుకోవాలని, మాదకద్రవ్యాల సరఫరాదారులతో తనకు సంబంధాలు ఉన్నాయని తేలితే తన తప్పును అంగీకరించడమే కాకుండా.. తాను ముంబైని శాశ్వతంగా వదిలేస్తానని కంగనా రనౌత్ సవాల్ విసిరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
I am more than happy to oblige @MumbaiPolice @AnilDeshmukhNCP please do my drug tests investigate my call records if you find any links to drug peddlers ever I will accept my mistake and leave Mumbai forever, looking forward to meet you 🙂 https://t.co/gs3DwcIOvP
— Kangana Ranaut (@KanganaTeam) September 8, 2020
కాగా, ఇప్పటికే ముంబైలోని కంగనా రనౌత్‌కు చెందిన మణికర్ణిక పిల్మ్స్ ఆఫీసుపై బీఎంసీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలున్నాయంటూ పేర్కొన్నారు. అంతేగాక, అక్రమంగా ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు కూడా వెనుకాడమని చెప్పారు.












Click it and Unblock the Notifications