జయా బచ్చన్ కు కౌంటర్ ఇచ్చిన కంగనా ... నా స్థానంలో మీ కూతురు ఉంటే ఇలాగే మాట్లాడతారా ?
బాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. పార్లమెంటులోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా రాజ్యసభ సభ్యురాలు, సమాజ్ వాదీ పార్టీ నాయకురాలు జయాబచ్చన్ డ్రగ్స్ విషయంలో రాజ్యసభ వేదికగా చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్పందించారు .

బాలీవుడ్ లో డ్రగ్స్ పై రాజ్యసభలో జయా బచ్చన్ వ్యాఖ్యలు
డ్రగ్స్ విషయంలో సినీ పరిశ్రమ పై నిందలు వేస్తున్నారని, చాలా మంది సొంత పరిశ్రమకే ద్రోహం చేస్తున్నారని, ఎవరో కొందరు అలా ఉంటే, మొత్తం సినీ పరిశ్రమను నిందించటం మంచిది కాదని జయాబచ్చన్ రాజ్యసభ లో వ్యాఖ్యలు చేశారు. సినీ రంగానికి ప్రభుత్వ మద్దతు కావాలని రాజ్యసభలో ఆమె మాట్లాడారు . నిన్న పార్లమెంట్లో బిజెపి ఎంపి చేసిన వ్యాఖ్యలను, అలాగే సినీ రంగ ప్రముఖులపై కంగనా రనౌత్ చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఎంపీ జయాబచ్చన్ మాట్లాడారు. దీనిపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన స్పందనను ట్వీట్ చేశారు.

నా స్థానంలో మీ కూతురు , సుశాంత్ స్థానంలో మీ కొడుకు ఉన్నా ఇలాగే చెప్తారా ? కంగనా కౌంటర్
జయా జీ ... నా స్థానంలో మీ కూతురు శ్వేత, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్థానంలో మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఉంటే మీరు ఇలాగే మాట్లాడేవారా అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా జయ బచ్చన్ వ్యాఖ్యల పై మండిపడిన కంగనా రనౌత్ మీ కూతురు శ్వేత టీనేజ్ లో నాలా బాలీవుడ్లో దెబ్బలు తిని, డ్రగ్స్ కి అలవాటు పడి, లైంగిక వేధింపులకు గురైతే మీరు ఇలానే మాట్లాడతారా ? సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లా మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ వేధింపుల గురించి ఫిర్యాదు చేసి, చివరకు ఆత్మహత్య చేసుకుంటే మీరు ఇలానే వ్యాఖ్యలు చేస్తారా? మా పై కూడా కాస్త దయ చూపండి అంటూ కంగనారనౌత్ జయా బచ్చన్ వ్యాఖ్యలపై తన స్పందనను తెలియజేశారు.

బాలీవుడ్ లో డ్రగ్స్ ,నెపోటిజం పై కంగనా పోరాటం
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ పై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అది కాస్త చిలికిచిలికి గాలివానగా మారింది. ఈ వ్యవహారంలో కంగనా రనౌత్ మొదటి నుంచి తన అభిప్రాయాలను, బాలీవుడ్ ప్రముఖుల పై తన ఆరోపణలను కుండ బద్దలు కొట్టినట్టుగా చెబుతోంది. అంతేకాదు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా, కొందరు బాలీవుడ్ ప్రముఖులకు మద్దతుగా నిలుస్తోంది అంటూ మహారాష్ట్ర సర్కార్ పై కూడా ఎదురు దాడికి దిగారు కంగనా రనౌత్.

కంగనా వ్యాఖ్యలపై జయాబచ్చన్ ఏమంటారో ?
బాలీవుడ్లో మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మరి రాజకీయ దుమారం అయింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో రోజుకో కొత్త అంశాలు, కొత్త వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇది పార్లమెంట్ సమావేశాలలోనూ హాట్ టాపిక్ అయింది . పార్లమెంట్ సమావేశాలలోనూ చర్చ జరుగుతుంది. తాజాగా రాజ్య సభలో జయాబచ్చన్ వ్యాఖ్యలను ఉద్దేశించి కంగనారనౌత్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ పై జయా బచ్చన్ ఏ విధంగా స్పందిస్తారు. అసలేం జరగబోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications