
Kangana: సీఎంతో చెస్ ఆడుతావా ? కంగనా నువ్వెంత ? హైకోర్టు లాయర్ దెబ్బతో ఎఫ్ఐఆర్, ఫేస్ బుక్ !
ముంబాయి/ న్యూఢిల్లీ/ జైపూర్: బాలీవుడ్ బ్యూటీ, ఫేమస్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ పై ఎఫ్ఐఆర్ నమోదైయ్యింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను కించపరిచే విధంగా మాట్లాడటం, అవహేళగా సోషల్ మీడియాలో పోస్టులు చేసి సీఎంను విమర్శిస్తున్నదని ఆరోపిస్తూ కంగనా రౌనత్ పై బాంబే హైకోర్టు ( ముంబాయి హైకోర్టు) న్యాయవాది కేసు పెట్టారు. ఒక రాష్ట్రానికి సీఎం అయిన ఉద్దవ్ ఠాక్రేతో చెస్ (గేమ్స్) ఆడుతావా ? నీకు ఎంత ధైర్యం ? నువ్వెంత ? చట్టపరంగా నీ అంతు చూస్తాం అంటూ కంగనా రౌనత్ మీద ఆ న్యాయవాది మండిపడుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మూవీ మాఫియాతో పోల్చిన కంగనా రౌనత్ మీద క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని హైకోర్టు న్యాయవాది పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు.
Illegal affair: ఆంటీ టీచర్, బెడ్ రూమ్ లో రొమాన్స్ పాఠాలు, తట్టుకోలేని భర్త ఎడిటింగ్ చేశాడు!

సెప్టెంబర్ 9వ తేదీ బుధవారం
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మూవీ మాఫియాతో పోల్చుతూ ఈనెల 9వ తేదీన బాలీవుడ్ బ్యూటీ కంగనా రౌనత్ ఫేస్ బుక్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన మీద మహారాష్ట్ర ప్రభుత్వం పగ, ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నదని, ఇలాంటి బుడ్డబెదిరింపులకు తాను బెదిరేదిలేదని కంగనా రౌనత్ ఘాటుగా ఆమె ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

ఉద్దవ్ ఠాక్రే, కరన్ జోహార్ గ్యాంగ్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ గ్యాంగ్ కలిసి ముంబాయిలోని తన కార్యాలయాన్ని నేలమట్టం చేశారని బాలీవుడ్ బ్యూటీ ఫేస్ బుక్ లో మండిపడింది. ఇప్పుడు నా భవనం నేలమట్టం చేశారు, మీరు ఇంకా ఒక అడుగు ముందుకు వెయ్యండి, నన్ను చంపేయండి, నేను చచ్చినా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను, మీ బండారం మొత్తం బయటపెడుతా, నేను ఎవ్వరినీ అంత సామాన్యంగా వదిలిపెట్టను అంటూ బాలీవుడ్ బ్యూటీ కంగనా రౌనత్ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

మహారాష్ట్రానా ? పాక్ అక్రమిత కాశ్మీరా
మహారాష్ట్రాను కొందరు పాక్ అక్రమిత కాశ్మీర్ లాగా చేసేస్తున్నారని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ మండిపడిన విషయం తెలిసిందే. తాను మహారాష్ట్రలో అడుగుపెట్టకుండా చూస్తున్నారని, తాను ఏమైనా కాశ్మీర్ అక్రమిత కాశ్మీర్ లో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నానా ?, కొందరు ఎందుకు కావాలనే తన మీద ఇంత పగపట్టారు ? అంటూ కంగనా రౌనత్ ఆవేశంతో ఊగిపోయారు.

సీఎంతో గేమ్స్ ఆడుతావా ?
బాంబే హైకోర్టు న్యాయవాది నితిన్ మానే ముంబాయిలోని విఘోషి పోలీస్ స్టేషన్ లో బాలీవుడ్ నటి కంగనా రౌనత్ మీద కేసు పెట్టారు. ఉద్దవ్ ఠాక్రే ఒక రాష్ట్రానికి (మహారాష్ట్ర)కు ముఖ్యమంత్రి, సీఎంతోనే కంగనా గేమ్స్ ఆడుతున్నదని, సీఎం పరువుకు భంగం కలిగేలా విమర్శలు చేస్తున్నదని, ఆమె మీద క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని హైకోర్టు న్యాయవాది నితిన్ మానే ముంబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయ్యో కంగనా.... పాపం !
బాలీవుడ్ నటి కంగనా రౌనత్ మీద ఐపీసీ సెక్షన్ 499 కింద కేసు నమోదు అయ్యింది. బాలీవుడ్ నటి కంగనా రౌనత్ సీఎం ఉద్దవ్ ఠాక్రేని కించపరిచి ఫేస్ బుక్ లో పోస్టు చేసిన స్క్రీన్ షాట్ లను హైకోర్టు న్యాయవాది నితిన్ మానే పోలీసులకు సాక్షంగా ఇచ్చారు. మొత్తం మీద మహారాష్ట్ర ప్రభుత్వం మీద యుధ్దం చేస్తున్న కంగనా రౌనత్ కు ఇప్పుడు పోలీసులు, న్యాయవాదుల కారణంగా అసలు సిసలైన సినిమా కష్టాలు మొదలైనాయని కొందరు అంటున్నారు.