Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kangana Ranaut: కంగనా వ్యాఖ్యలపై వివాదం.. సమర్థించుకున్న బీజేపీ ఎంపీ

Kangana Ranaut: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ దుమారంలో చిక్కుకున్నారు. ఆదివారం హిమాచల్ ప్రదేశ్‌లోని తన నియోజకవర్గమైన మండీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కంగనా రనౌత్.. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలకు విపత్తు సహాయం అందించేందుకు తన వద్ద కేబినెట్ పోస్ట్ లేదని చేసిన వ్యాఖ్య వివాదాస్పదంగా మారింది. ఆయినా ఈ వ్యాఖ్యపై ఆమె దృఢంగా నిలబడ్డారు. అది వివాదాస్పదం కాదని.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే విధానమని అన్నారు.

ఆదివారం వరద బాధితులతో కంగనా రనౌత్ మాట్లాడుతూ.. "విపత్తు సహాయక చర్యలు చేపట్టేందుకు నాకేం అధికారిక కేబినెట్ లేదు. విపత్తు నిధులు లేవు. నాతో పాటు నా ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇది నా కేబినెట్. ఎంపీగా నా పని పార్లమెంటుకు పరిమితం. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడమే నా బాధ్యత" అని కంగనా రనౌత్ అన్నారు. కేంద్ర సర్కారు నుంచి పూర్తి సహాయం అందిస్తానని కంగనా హామీ ఇచ్చారు.

Kangana Ranaut s Controversial Remarks on Flood Relief BJP MP Defends Her Statement

తనకు విపత్తు నిధులు లేవు లేదా కేబినెట్ పదవి లేదని తాను చేసిన వ్యాఖ్యలపై సోమవారం బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. తన ప్రకటనలు వివాదాస్పదం కాదని.. అది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే విధానమని ఆమె అన్నారు. "నా చేతుల్లో ఏముంది, ఏమీ లేదు అనే వాస్తవాన్ని నేను ప్రజలకు చెప్పాను. ఒక ఎంపీగా, మేము ప్రజల సమస్యలను లేవనెత్తి నిధులను తీసుకురావాలి. నాకు ఒక పరిమితి ఉంది. మా పార్టీ ప్రజల అన్ని అవసరాలను తీరుస్తుందని నేను ప్రజలకు చెప్పాను" అని కంగనా సోమవారం తెలిపారు.

హిమాచల్‌కు ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్
వర్షాల సంబంధిత సంఘటనల వల్ల ఇప్పటివరకు 78 మంది మరణించిన హిమాచల్ ప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ కోసం తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని, డిమాండ్‌ను లేవనెత్తుతానని కంగనా రనౌత్ చెప్పారు. మండి నియోజకవర్గాన్ని సందర్శించడంలో ఆలస్యంపై తనను విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఆమె విరుచుకుపడ్డారు. "కాంగ్రెస్ నా రెండు వాక్యాలను పట్టుకుని నాకు వ్యతిరేకంగా మాట్లాడింది. వారు నిధులను ఎక్కడ ఉపయోగిస్తారో మనం చూడాలి. నేను ప్రజల వద్దకు చేరుకోవడంలో ఆలస్యం చేయలేదు." అని కంగనా అన్నారు. తాను ప్రజలకు అందుబాటులో ఉన్నానని బీజేపీ ఎంపీ తేల్చి చెబుతూనే.. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం క్లౌడ్ బరస్ట్‌ల కారణంగా మరణించిన వారికి లేదా గాయపడిన వారికి లేదా తమ వస్తువులను కోల్పోయిన వారికి సహాయం అందించడం లేదని ఆరోపించారు.

ఇప్పటివరకు మండి జిల్లాలో 14 మంది మరణించారు. 31 మంది గల్లంతైన వారి కోసం గాలింపు జరుగుతోంది. క్లౌడ్ బరస్ట్‌లు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం హిమాచల్ ప్రదేశ్ అంతటా భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ విపత్తులో 150కి పైగా ఇళ్లు, 106 పశువుల షెడ్లు, 31 వాహనాలు, 14 వంతెనలు, అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. మొత్తంగా 164 పశువులు మరణించాయి. ఆదివారం నాటికి మండి జిల్లాలో దాదాపు 200 రోడ్లు ట్రాఫిక్‌కు అందుబాటులో లేకుండా పోగా, 236 ట్రాన్స్‌ఫార్మర్‌లు, 278 సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+