స్నేహితురాలితో కన్నయ్య ఫోటో హల్‌చల్
న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ అనవసరమైన ప్రచారం పొందుతున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని తప్పు పట్టే విధంగా చూపించడానికి ఓ పొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
అది కన్నయ్య కుమార్ తన స్నేహితురాలు సౌమ్య మణి త్రిపాఠితో దిగిన ఫొటో. అతను ఆమె పక్కన కూర్చుని ఆమె వైపు నవ్వులు కురిపిస్తూ చూస్తున్న ఫోటో అది. ఆ ఫోటో వారిద్దరి మధ్య ఏ విధమైన తప్పుడు సంబంధాలు ఉన్న విషయాన్ని వెల్లడించడం లేదు. కానీ, వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూపించే విధంగా ఉంది.

ఆ ఫోటో ద్వారా తన స్నేహితురాలికి మచ్చ తెస్తున్నారని, అలా ఫొటో తీయడం తప్పు కాదా అని కన్నయ్య కుమార్ అంటున్నారు. ఓ విధమైన రుజువులు లేకుండా ఓ మహిళ వ్యక్తిత్వంపై బురద చల్లడమేనని అంటున్నారు. సౌమ్య మణి త్రిపాఠి కూడా ఆ పోస్టింగ్‌పై స్పందించారు.
వారి మానసిక రోగం తనకు విచారం కలిగిస్తోందని, సోషల్ మీడియా పోస్ట్ చేసిన ఫొటో ఇతర ఫొటోల మాదిరిగానే అతి సాధారమైందని, వివిధ వేదికల మీద ఆ ఫొటోను పెట్టడం అంగీకారయోగ్యం కాదని ఆమె అన్నారు. తన అభిప్రాయాన్ని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. కన్నయ్యతో ఫొటో దిగడం ద్వారా తాను తప్పు చేశానని అనుకోవడం లేదని అన్నారు.
త్రిపాఠిని తొలుత కన్నయ్య ప్రొఫెసర్‌గా భావించి పోస్టులు చేశారు. తాను ప్రొఫెసర్‌ను కానని, రీసెర్చ్ స్కాలర్‌ను అనే విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నట్లు ఆమె తెలిపారు. ఓ మహిళను ఈ విధంగా కించపరచడం సరి కాదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications