హీరో దర్శన్ సినిమా స్టైల్లో ఫినిష్, గుడిలో వేటకొడవళ్లకు పూజలు, ఫ్యాక్షన్ సినిమా వేస్ట్

బెంగళూరు సిటీలోని పులికేశీ నగర్‌లోని పీఎస్‌కే నాయుడు లేఅవుట్‌లోని కారు షెడ్‌ సమీపంలో దేవనహళ్లి ఐటీసీ ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగి అజిత్‌(30) హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను పులికేశి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హీరో దర్శన్ నటించిన కరియా సినిమా స్టైల్లో గుడిలో వేటకొడవళ్లు పెట్టి పూజలు చేసిన తరువాత ఆదే ఆయుధాలతో అజిత్ ను సినిమా ఫక్కీలో చంపేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.

అజిత్ హత్య కేసులో హంతకులు దొడ్డగూబికి చెందిన కిరణ్‌, రాహుల్‌లను అరెస్ట్‌ చేసి మరో నిందితుడు బాలాజీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.అయితే ఇప్పుడు అజిత్ హత్య కేసులో ట్విస్ట్ తెలుసుకున్న బెంగళూరు పోలీసులు షాక్ అయ్యారు. హత్య కేసులో సెంట్రల్ జైల్లో ఉన్న హీరో దర్శన్ గతంలో కరియా అనే సినిమాలో నటించాడు. కరియా సినిమా దర్శన్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టడమే కాకుండా రాత్రికిరాత్రి ఆయన పెద్ద హీరో అయిపోయాడు.

Kannada Hero Darshan starrer Kiriya movie style accused of murder

హీరో దర్శన్ నటించిన కరియా సినిమా హంతకులకు స్ఫూర్తిగా నిలిచిన సంగతి తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారని తెలిసింది. దర్శన్ నటించిన కరియా సినిమాని స్ఫూర్తిగా తీసుకుని హంతకులు అజిత్‌ని చంపడానికి ముందే సిద్ధం చేసుకున్నారు.పోలీసులవిచారణలో హంతకుల దైవభక్తి వెల్లడైంది. హంతకుల ట్రావెల్ హిస్టరీ తీస్తే అజిత్ హత్యకు ముందు తమిళనాడు వెళ్లారని తెలియడంతో పోలీసులు అవాక్కయ్యారు.

కరియా సినిమా ప్రభావం వల్లే తాము మారణాయుధాలతో సహ తమిళనాడుకు వెళ్లామని నిందితులు అంగీకరించారు, హత్యను విజయవంతం చేసేందుకు హంతకులు ఆయుధాలతో తమిళనాడుకు వెళ్లారని పోలీసులు అన్నారు. తమిళనాడులోని ఓ గుడి ముందు ఆయుధాలు పెట్టి పూజలు చేశారు. అజిత్ హత్యను విజయవంతం చేసేందుకు ఆయుధాలను ప్రత్యేకంగా పూజించారు. సాధారణంగా ప్రొఫెషనల్ కిల్లర్స్ తమిళనాడులోని ఆ దేవత గుడికి కూడా వెళ్తుంటారని పోలీసులు అన్నారు.

ప్రస్తుతం చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న నటుడు దర్శన్ నటించిన కరియా సినిమాలో కూడా ఇదే సీన్ ఉంది. ఈ నమ్మకంతో హంతకులు గుడికి వెళ్లి ఆయుధాలు పెట్టి పూజలు చేశారు. ప్రస్తుతం విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.రెండు, మూడేళ్లుగా కిరణ్, అజిత్ మధ్య ఓ పనికిమాలిన విషయంపై మనస్తాపం నెలకొంది. ఏడాదిన్నర క్రితం కిరణ్‌ రామ్మూర్తి నగర్‌కు వచ్చినందుకు దాడికి పాల్పడ్డాడు.

Kannada Hero Darshan starrer Kiriya movie style accused of murder
ఈ ఘటన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. గత నెల 19వ తేదీన పుట్టినరోజు జరుపుకునేందుకు స్నేహితులతో కలిసి పీఎస్‌కే నాయుడు లేఅవుట్‌కు వచ్చిన కిరణ్‌ను అజిత్ మళ్లీ కొట్టాడు. అప్పట్లో రామ్మూర్తి నగర్‌లో ఇచ్చిన దెబ్బలు సరిపోవని, నీకు ఇంకా దెబ్బలు పడాలా అంటూ అజిత్ అతని మాజీ స్నేహితుడు కిరణ్ ను ఉద్దేశించి చులకనగా మాట్లాడాడని పోలీసులు తెలిపారు.

ఈ మాటలకు ఆగ్రహించిన కిరణ్ చివరకు అజిత్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ చర్యకు అతడి ఇద్దరు స్నేహితులు సహకరించారని పోలీసు అధికారులు తెలిపారు.పులికేశీనగర్‌ సమీపంలోని ఓ లాడ్జిలో ఏడెనిమిది రోజులుగా నిందితులు మకాం వేసి అజిత్‌ను ఫాలో అయ్యారు. తరువాత అజిత్ కదలికలపై సమాచారం సేకరించారు. చివరకు బుధవారం ఉదయం పీఎస్‌కే నాయుడు లేఅవుట్‌లోని కార్‌షెడ్‌కు అజిత్ వస్తాడని నిర్ధారించుకున్న నిందితులు అతన్ని హత్య చేశారని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+