అనుమానాస్పద స్థితిలో ఫ్రెండ్ గదిలో టీవి నటి మృతి
బెంగళూరు: కన్నడ టెలివిజన్ నటి తన మిత్రుడి గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ సంఘటన బెంగళూరులోని మాదనాయకనహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. హరోహళ్లికి చెందిన శ్రుతి (24)కి ఏడేళ్ల క్రితం రమేష్ అనే వ్యాపారితో వివాహమైంది.
శ్రుతికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈమె ఇంటికి సమీపంలోని కాచోహళ్లిలో శ్రీకాంత్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడితో శ్రుతికి స్నేహం ఏర్పడినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి శ్రీకాంత్ ఇంటికి శ్రుతి వెళ్లింది. ఆ సమయంలో ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

గొడవ జరిగిన కొద్ది సేపటికే శ్రుతి ఓ గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. మిత్రుల సాయంతో గది తలుపులు బద్దలు కొట్టి చూడగా శ్రుతి ఉరి వేసుకున్న దృశ్యం కనిపించింది. దాంతో శ్రీకాంత్ పోలీసులకు సమాచారం ఆందించాడు.
శ్రీకాంత్‌పై ఆరోపణలు చేస్తూ ఉమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రుతిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు శ్రీకాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో శ్రుతి ఆత్మహత్య చేసుకుంది.












Click it and Unblock the Notifications