యూపీలో కుప్పకూలిన రైల్వే స్టేషన్-శిథిలాల కింద 25 మంది ?
ఉత్తర్ ప్రదేశ్ లో ఇవాళ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కన్నౌజ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఆధునీకీరణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ రైల్వే స్టేషన్ లో కొత్తగా నిర్మిస్తున్న భవనం ఒకటి హఠాత్తుగా కుప్పకూలింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో 23 మందిని సిబ్బంది కాపాడారు. అయితే మరో 25 మంది వరకూ శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న పైకప్పు స్లాబ్ మధ్యాహ్నం ఉన్నట్లుండి కుప్పకూలింది. పనులు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో కనీసం 20 మంది కార్మికులు చిక్కుకుపోయారని అధికారులు చెప్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:39 గంటలకు షట్టరింగ్ విఫలమవడంతో నిర్మాణంలో ఉన్న లింటల్ కూలిపోయింది. దీంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనీసం ఆరుగురు కార్మికులు గాయపడగా వారిని చికిత్స కోసం వారిని ఆస్పత్రికి తరలించారు.

భవనం శిధిలాల కింద చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు స్థానిక యంత్రాంగం భారీ రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ , ప్రభుత్వ రైల్వే పోలీసులు ఘటనా స్ధలిలో బాధితుల్ని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్మాణంలో ఉన్న షట్టరింగ్ కూలిపోవడంతో ఈ సంఘటన జరిగిందని అదికారులు నిర్ధారించారు. సీనియర్ అధికారులతో కలిసి సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
చిక్కుకున్న కార్మికులను రక్షించడమే మా మొదటి ప్రాధాన్యత. రెస్క్యూ ప్రయత్నాల కోసం మేము మా వద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తున్నాము, "అన్నారాయన.












Click it and Unblock the Notifications