తల్లిదండ్రుల కళ్లెదుటే ఆర్‌ఎస్ఎస్ కార్యకర్త హత్య
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని కన్నూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్తను కొందరు దుండగులు(సీపీఎం నాయకులుగా భావిస్తున్నవారు) అతని తల్లిదండ్రుల కళ్ల ముందే హత్య చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఇరువర్గాల మధ్య మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వర్గపోరుకు తెరదించేందుకు చర్చలు జరుపాలని ఇటీవలే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. కాగా, ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త సోమవారం రాత్రి హత్యకు గురికావడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.
సోమవారం రాత్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్త సుజిత్(27) ఇంట్లోకి ప్రవేశించి దుండగులు అతన్ని కొట్టి చంపారు. సుజిత్ తల్లిదండ్రులు ఈ దారుణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో వారిపై కూడా దుండగులు దాడిచేశారు.

ఈ ఘటనలో సుజిత్ తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. ఈ హత్యకు పాల్పడిన దుండగులు సీపీఎంకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ కన్నూర్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ బంద్‌కు పిలుపునిచ్చింది.
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు కొడియెరి బాలకృష్ణన్ స్పందిస్తూ.. ఇది రాజకీయ హత్య కాదని, స్థానిక గొడవలే ఈ హత్యకు దారితీసినట్టు తెలుస్తోందని చెప్పారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు 8 మంది సీపీఎం మద్దతుదారులను అరెస్టు చేశారు. జిల్లాలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడానికి సీపీఎం ప్రయత్నిస్తున్నదని బిజెపి, ఆర్ఎస్ఎస్ ఆరోపించాయి.












Click it and Unblock the Notifications