జీన్స్ వేసుకొన్నారని తొడలను కోశారు: యూపీలో దాష్టీకం
కాన్పూర్: యూనిఫాం వేసుకొని స్కూల్‌కు రాలేదనే నెపంతో ఓ విద్యార్థి తొడలు కోసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.జీన్స్ ధరించి వెళ్ళిన పాపానికి స్కూల్ యాజమాన్యం ఈ దారుణానికి పాల్పడింది.
ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సికందర్ నగర సమీపంలోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. 11వ తరగతి చదువుతన్న విద్యార్థి రోజు మాదిరి స్కూల్ యునిఫాం కాకుండా జీన్స్ ధరించి శనివారం పాఠశాలకు వెళ్లాడు.

దీంతో ఆగ్రహానికి గురైన స్కూల్ మేనేజర్ ప్యాంట్‌ను కత్తిరించాలని టీచర్లకు సూచించాడు. దీంతో ఓ టీచర్ ఆ విద్యార్థి ప్యాంట్‌ను తొడలపై భాగం వరకు కత్తిరించే సమయంలో విద్యార్థి తొడలకు తీవ్రగాయాలయ్యాయి.
ఈ విషయమై బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి తండ్రి స్కూల్ యాజమాన్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications