మోడీతో భేటీ: ప్రధానమంత్రి సహాయ నిధికి కపిల్‌ దేవ్‌ విరాళం

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్‌ దేవ్‌ ప్రధాన మంత్రి జాతీయ విపత్తు సహాయ నిధికి రూ.51 లక్షల విరాళాన్ని అందించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆయన బుధవారం కలిసి చెక్‌ను అందించారు.

కపిల్‌దేవ్‌ 'కిన్‌షిప్‌ ఫర్‌ హ్యూమానిటేరియన్‌ సోషల్‌ అండ్‌ హోలిస్టిక్‌ ఇంటర్‌వెన్షన్‌ ఇన్‌ ఇండియా' సంస్థకు అధిపతిగా ఉన్నారు. తన మిత్రులతో కలిసి ఈ సంస్థను 2002లో కపిల్‌ ప్రారంభించారు. ఈ సంస్థ తరఫునే కపిల్‌ విరాళాన్ని ప్రధానికి అందజేశారు. కపిల్‌దేవ్ సారథ్యంలో 1983లో భారత్‌కు ప్రపంచకప్ టైటిల్ తొలిసారి వచ్చిన సంగతి తెలిసిందే.

Kapil Dev calls on PM Narendra Modi, donates Rs 51 lakhs for PMNRF

జిఎస్‌టి సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

జిఎస్‌టి(వస్తు సేవల పన్ను) సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం లోక్‌సభలో జిఎస్‌టి సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. బిల్లు సభ ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు.

ప్రధాని చైనా పర్యటన ఖరారు: చైనా భాషలో ట్వీట్లు

ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటన ఖరారైంది. మే 14 నుంచి 16 వరకు ఆయన చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్లో చైనా భాషలో ట్వీట్‌లు పెట్టి ఆకట్టుకున్నారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగవ్వడానికి ఇది చాలా మంచి తరుణమన్నారు.

ఇటీవలే చైనీయుల సోషల్‌ మీడియాలో ఖాతా ప్రారంభించిన మోడీ.. ఇప్పుడు తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో చైనీస్‌లో ట్వీట్లు చేసి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఆయన తన పర్యటనలో భాగంగా బీజింగ్‌, షాంఘైల్లో పారిశ్రమిక వర్గాలతో భేటీ కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+