కర్నాటక మంత్రివర్గ విస్తరణ-బొమ్మై కేబినెట్లో 29 మంది-నో డిప్యూటీ సీఎం
కర్నాటకలో కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై తన మంత్రివర్గాన్ని ఇవాళ విస్తరించబోతున్నారు. కాసేపట్లో రాజ్ భవన్ లో జరిగే కార్యక్రమంలో ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారు. తన కేబినెట్ లో మొత్తం 29 మంది మంత్రులు ఉంటారని ఆయన వెల్లడించారు. అలాగే డిప్యూటీ సీఎంగా ఎవరినీ నియమింంచడం లేదన్నారు.
కర్నాటక కేబినెట్లో సీఎంతో సహా మొత్తం 34 మందికి చోటు కల్పించే అవకాశం ఉన్నా ప్రస్తుతానికి మాత్రం 29 మందితోనే సరిపెట్టాలని సీఎం బసవరాజ్ బొమ్మై నిర్ణయించారు. డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇప్పుడే ఎవరికీ ఇవ్వరాదని కూడా బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ కూర్పుపై పార్టీలో ఎలాంటి అసంతృప్తీ లేదని, తనకు బీజేపీ అధిష్టానంతో పాటు మాజీ సీఎం యడియూరప్ప ఆశీస్సులు ఉన్నాయని సీఎం బొమ్మై తెలిపారు.

Recommended Video
మరోవైపు మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను తన కేబినెట్లోకి తీసుకోబోవడం లేదని సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ అరుణ్ సింగ్ విజయేంద్రతో మాట్లాడినట్లు కూడా బొమ్మై పేర్కొన్నారు. తన కేబినెట్ సమతూకంతో ఉందని, కుల సమీకరణాలకు కూడా ప్రాధాన్యమిచ్చినట్లు బొమ్మై తెలిపారు. కేబినెట్లో ఓబీసీ, వక్కళిగ వర్గాలకు చెందిన తలో ఏడుగురు ఉంటారని, లింగాయత్ లకు చెందిన వారు ఎనిమిది మంది ఉంటారని, ముగ్గురు ఎస్సీలు, ఓ ఎస్టీ ఎమ్మెల్యే, ఓ రెడ్డి ఎమ్మెల్యేకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు బొమ్మై వెల్లడించారు.












Click it and Unblock the Notifications