దసరా మూవీలో కీర్తిసురేశ్ డ్యాన్స్ తో కర్ణాటకలో కాంగ్రెస్ హంగామా; అభ్యర్థులకు అధిష్టానం పిలుపు!!
కేంద్రంలోని అధికార బీజేపీకి షాక్ తగులుతోంది. బీజేపీ ఆశలను తల్లక్రిందులు చేస్తూ కాంగ్రెస్ కర్ణాటకలో దూకుడుగా ఉంది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా దూసుకుపోతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలలో అంచనాలను తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 125 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది.
మ్యాజిక్ ఫిగర్ దాటి కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న నేపధ్యంలో ఢిల్లీలోని ఎఐసిసి ప్రధాన కార్యాలయం వద్ద సందడి వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు అప్పుడే సంబరాలతో రచ్చ మొదలుపెట్టారు. కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా దూసుకుపోతున్నట్టు తాజా కౌంటింగ్ ట్రెండ్స్ చెబుతున్నాయి.

దీంతో కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టింది. దసరా సినిమాలో కీర్తి సురేష్ పెళ్లి డాన్స్ లో చేసిన తీన్మార్ స్టెప్పులతో కాంగ్రెస్ పార్టీ తమ విజయ అవకాశాలను తెలియజేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తోంది . కీర్తో సురేష్ డ్యాన్స్ లతో రచ్చ మొదలెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అందరూ బెంగళూరు చేరుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. ఫలితాలు తమకు అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు చేజారకుండా వ్యూహాలను కాంగ్రెస్ పార్టీ మొదలుపెడుతుంది. ఇదే సమయంలో అవసరం అయితే మద్దతు కోసం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది.

విజయావకాశాలు ఉన్న స్వతంత్రులతో మంతనాలు జరుపుతుంది. మరోవైపు రేపు సిఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అవసరాన్ని బట్టి క్యాంప్ రాజకీయాలకు రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ హోటల్స్ అన్నీ బుక్ చేసింది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో మధ్యాహ్నానికి కర్ణాటక కింగ్ ఎవరో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications