హైఓల్టేజ్ ఫైట్: కర్ణాటకలో కీలక అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాలు ఇవే..
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. అయిదు కోట్ల మందికి పైగా ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతోన్నారు. మొత్తం 224 నియోజకవర్గాలకు బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. 13వ తేదీన ఓట్ల లెక్కింపు.
పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను ఇదివరకే గుర్తించింది కేంద్ర ఎన్నికల కమిషన్. అలాంటి చోట్ల అదనపు పోలీసు బలగాలను మోహరించనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించనుంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది.

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ను విధించింది ఈసీ. మద్యం అమ్మకాలపైనా నిషేధం విధించింది. ఈ అర్ధరాత్రి 12 గంటల వరకు నిషేధం కొనసాగుతుంది. మళ్లీ ఓట్ల లెక్కింపు రోజున నిషేధం ఉంటుంది. మొత్తం 31 జిల్లాల్లో 5.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కొత్త ఓటర్ల సంఖ్య 11.7 లక్షలు. మొత్తం 58,545 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
ఈ ఎన్నికల్లో మొత్తం 2,613 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్షణ సవాది ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. బీజేపీలో టికెట్ లభించకపోవడం వల్ల చివరి నిమిషంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హుబ్లీ-ధార్వాడ నుంచి జగదీష్ షెట్టార్, అథణి నుంచి లక్షణ సవాది పోటీ చేశారు.
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై- షిగ్గావ్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య-వరుణ, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్-కనకపుర, జేడీఎస్ అధినేత కుమారస్వామి-చెన్నపట్టణ స్థానాల నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున మంత్రి ఆర్ అశోక.. డీకే శివకుమార్‌పై పోటీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన సొంత నియోజకవర్గం శికారిపురలో యడియూరప్ప కుమారుడు బీవై విజేంద్ర పోటీ చేశారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే- చిత్తాపూర్, కుమారస్వామి కొడుకు, ప్రముఖ నటుడు నిఖిల్ కుమారస్వామి- రామనగర స్థానాల నుంచి ఎన్నికల బరిలో దిగారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి- చిక్‌మగళూరు నుంచి పోటీలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే చిక్‌బళ్లాపురాలో బీజేపీ అభ్యర్థిగా మంత్రి డాక్టర్ సుధాకర్, బళ్లారి నుంచి బీ శ్రీరాములు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications