న్యూఇయర్‌ వేడుకలపై నిషేధం -కర్ణాటక సర్కార్ ఉత్తర్వులు -కరోనా భయంతో..

కరోనా మహమ్మారి ప్రభావం కొత్త ఏడాదిలోనూ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. వైరస్ వ్యాప్తి భయాల ప్రభావం న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై కూడా పడింది. కరోనా ఉధృతం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సరం వేడులకపై నిషేధం విధించింది.

బెంగళూరు సిటీతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిబంధన అమలవుతుందని, ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్ లాంటి చోట్ల ఎటువంటి ప్రత్యేక వేడుకులను చేపట్టరాదని సర్కారు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నిషేధం డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకూ అమల్లో ఉంటుందని పేర్కొంది.

Karnataka Bans New Year Celebrations To Control COVID-19 Spread

కాగా, పబ్లిక్ ప్లేసులు, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల్లో నిషేధ ఉత్తర్వులుంటాయన్న ప్రభుత్వం.. క్లబ్‌లు, రెస్టారెంట్లు, పబ్‌లు మాత్రం ఎప్పటిలాగే సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని పేర్కొనడం గమనార్హం. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా, కొత్త సంవత్సరం, క్రిస్మస్ పండుగల్లో ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న సామూహిక కార్యక్రమాలను నిషేధించడమైనదని చీఫ్ సెక్రెటరీ పేరిట శుక్రవారం ఆదేశాలు విడుదలయ్యాయి.

తొలినాళ్లలో తక్కువ కేసులున్న కర్ణాటకలో రానురాను వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.3కోట్లకుపైగా టెస్టులు నిర్వహించగా, మొత్తం కేసులు 9.05లక్షలు వచ్చాయి. కర్ణాటకలో కరోనా మరణాల సంఖ్య 12వేలుగా ఉంది. ఇప్పటికే 8.78లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 15,205గా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+