మీ సేవలు చాలు ఇక- అప్పను పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ
KS Eshwarappa: కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించింది. మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న ఈ రాష్ట్రంలో రెండు విడతల్లో పోలింగ్ జరుగనుంది. 14 స్థానాలకు ఈ నెల 26వ తేదీన, మిగిలిన వాటికి మే 7వ తేదీన ఎన్నికలు షెడ్యూల్ అయ్యాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.
పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ- జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన మెజారిటీ లోక్‌సభలోనూ నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్..పట్టుదలతో ఉన్నారు.

ఈ పరిస్థితుల మధ్య బీజేపీ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆరు సంవత్పసరాల పాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఈశ్వరప్ప సొంత నియోజకవర్గం శివమొగ్గ. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయన కుమారుడికి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది బీజేపీ. ఇప్పుడు కూడా శివమొగ్గ లోక్‌సభ టికెట్ ఈశ్వరప్ప తనయుడికి లభించలేదు.
శివమొగ్గ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్రను బరిలోకి దింపింది. దీనిపై తీవ్ర అసంతృప్తికి లోనైన ఈశ్వరప్ప ఇండిపెండెంట్‌గా శివమొగ్గ నుంచే పోటీలో నిలిచారు. నామినేషన్ సైతం దాఖలు చేశారు.
నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవాలంటూ ఈశ్వరప్పను బుజ్జగించినప్పటికీ ఫలితం రాలేదు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ రంగంలోకి దిగినా ఫలితం రాలేదు. దీనితో ఈశ్వరప్పను పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా శాండల్‌వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతా రాజ్‌కుమార్ ఇక్కడ పోటీలో ఉన్నారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications