మాజీ ప్రధాని ఫ్యామిలీ ప్యాకేజ్, తండ్రి, కొడుకులు, కొడలు, మనుమడు, ఏం మిగిలింది స్వామి!
మైసూరు/బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ సుప్రీం (జాతీయ అధ్యక్షుడు) హెచ్.డి. దేవేగౌడ మీద బీజేపీ నాయకులు విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఏమైనా మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ అప్ప (తండ్రి) ఆస్తినా అంటూ హాసన్ బీజేపీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ తీవ్రస్థాయిలో విమర్శించారు. బెంగళూరు నుంచి మైసూరు వరకు అన్ని నియోజక వర్గాల్లో మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబ సభ్యులు పాగా వేస్తున్నారని, ఇక జేడీఎస్ పార్టీ కార్యకర్తలకు ఏం మిగిలిందని బీజేపీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ ప్రశ్నించారు.
చెన్నపట్టణలో సీఎం కుమారస్వామి ఎమ్మెల్యే, రామనగరలో సీఎం కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి ఎమ్మెల్యే, హాసన్ లో మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ ఎంపీ, అదే జిల్లాలో మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడు రేవణ్ణ ఎమ్మెల్యే, ఇప్పుడు మండ్య లోక్ సభ ఎన్నికల్లో సీఎం కుమారస్వామ కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. మంత్రి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ సైతం హాసన్ నుంచి పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఇక మిగిలింది భావానీ రేవణ్ణ (సీఎం సోదరుడి భార్య) మాత్కమే అని,ఆమెను కూడా ఎన్నికల బరిలో దింపుతారా అని బీజేపీ నాయకులు ప్రశ్నించారు.

అగ్రిమెంట్ చెయ్యలేదు
మైసూరు నగరంలోని జేకే మైదానంలో బీజేపీ శక్తి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ కుటుంబ సభ్యుల మీద బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. దేవేగౌడ కుటుంబ సభ్యులకు గౌడ కులస్తులు జీపీఏ (అగ్రిమెంట్) చేసి ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ అన్నారు.

బ్రాండెడ్ లేబర్స్
మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబ సభ్యులకు తాము బ్రాండెడ్ లేబర్స్ కాదని ప్రీతం గౌడ అన్నారు. దేవేగౌడ కుటుంబ సభ్యులకు ఓటు వేస్తే అది ప్రవేటు ప్రాపర్టీ అయిపోతుందని, అదే బీజేపీకి ఓటు వేస్తే అది దేశ అభిసృద్దికి వేసినట్లు అవుతుందని బీజేపీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ అన్నారు.

ఆస్తులు కాదు
ఇంటి ఆస్తులు కుటుంబ సభ్యులకు భాగాలు పెట్టే సమయంలో ఇది నీకు, ఇది నాకు, అది తమ్ముడికి అంటూ పెద్దలు నిర్ణయిస్తారని బీజేపీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ చెప్పారు. అయితే మాజీ ప్రధాని దేవేగౌడ మాత్రం కర్ణాటకలోని నియోజక వర్గాలకు బిడ్డలకు, వాళ్ల బిడ్డలకు భాగాలు పెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ వ్యంగంగా అన్నారు.

గౌడ అంటే మీరేనా ?
గౌడ అనే పదం కేవలం దేవేగౌడ కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితం అయ్యిందని ప్రీతం గౌడ అరోపించారు. మైసూరు- కొడుగు లోక్ సభ నియోజక వర్గం ఎంపీ ప్రతాప్ సింహా (బీజేపీ) సైతం గౌడ కులస్తుడు, ఆయన ఏమీ ఆకాశం నుంచి ఊడి కిందపడలేదని, కుల పిచ్చితో తిరగలేదని ప్రీతం గౌడ అన్నారు.

ఈ వయసులో అసరమా ?
మాజీ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ పార్లమెంట్ కు వెళ్లడానికి తోడుగా దేవేగౌడ ఆయన మనుమడిని వెంటపెట్టుకుని వెళ్లడానికి సిద్దం అయ్యారని వ్యంగంగా అన్నారు. ఈ వయసులో మీకు ఎన్నికలు, రాజకీయాలు అవసరమా అని దేవేగౌడను ప్రశ్నించారు.

పార్లమెంట్ లో నిద్ర !
ఎంపీగా ఎన్నిక అయిన మాజీ ప్రధాని దేవేగౌడ పార్లమెంట్ సమావేశాలకు వెలుతారని, కాని అక్కడ కర్ణాటక ప్రజల సమస్యల గురించి ఇప్పటి వరకూ ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరైయ్యే దేవేగౌడ కొంత సమయం హాయిగా నిద్రపోయి తరువాత లేచివస్తారని వ్యంగంగా అన్నారు.

డిపాజిట్ గల్లంతు
మైసూరు-కొడుగు లోక్ సభ నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి ఎవరు వచ్చినా పర్వాలేదని, అది పెద్ద గౌడ (దేవేగౌడ), చిన్నగౌడ (కుమారస్వామి), పిల్ల గౌడ ( వారి కుమారులు) అయినా సరే అని, వారికి డిపాజిట్లు రాకుండే చేసి ఓడించి పంపిస్తామని బీజేపీ నాయకులు సవాలు చేశారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications