బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అయ్యో: కర్ణాటకకు కాదు కర్ణాటాటా, కాంగ్రెస్ కు టాటా చెప్పండి, జేడీఎస్ విలీనం అయ్యిందా, బీజేపీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ నాయకులు పప్పులో కాలేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్న బహిరంగ సభా సమావేశంలో ఏర్పాటు చేసిన బ్యానర్ లో కర్ణాటక పేరును తప్పుగా కర్ణాటాటా అని రాసిన నాయకులు ఇప్పుడు బీజేపీ నాయకుల విమర్శలతో తలలు పట్టుకున్నారు.

కర్ణాటకలో బీజేపీకి 17 ఎంపీ సీట్లు, సీఎం కొడుకు కు షాక్, సుమలత హవా, వీడీపీ సర్వే, యూపీలో!కర్ణాటకలో బీజేపీకి 17 ఎంపీ సీట్లు, సీఎం కొడుకు కు షాక్, సుమలత హవా, వీడీపీ సర్వే, యూపీలో!

కర్ణాటక పేరును బ్యానర్ లో సక్రమంగా రాయలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడి ప్రజలకు ఏం న్యాయం చేస్తారు అంటూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక పేరును కర్ణాటాటా అని రాసిన కాంగ్రెస్ నాయకులు వెంటనే కన్నడిగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

రాహుల్, మాజీ ప్రధాని

రాహుల్, మాజీ ప్రధాని

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ పార్టీలు కలిసి ఆదివారం బెంగళూరు నగర శివార్లలోని బిఐఇసీ మైదానంలో భారీ బహిరంగ సభా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తదితరులు హాజరైనారు.

కర్ణాటక కాదు కర్ణాటాటా

బహిరంగ సభా సమావేశంలో నాయకులు కుర్చునే వెనక భాగంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆద్వర్యంలో భారీ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్ లో కర్ణాటక ( KARNATAKA)కు బదులుగా కర్ణాటాటా (KARNATATA)అని రాసి పెట్టారు. కనీసం ఒక్క నాయకుడు కూడా జరిగిన పోరపాటు గుర్తించలేదు. సమావేశం పూర్తి అయిన తరువాత బ్యానర్ అలాగే వదిలేశారు.

బీజేపీ డేగ కన్ను

బీజేపీ డేగ కన్ను

సోమవారం రాత్రి ఈ విషయం గుర్తించిన బీజేపీ కర్ణాటక శాఖ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పే సమయం దగ్గర పడిందని విమర్శించింది. కర్ణాటక అనే పేరు సక్రమంగా రాయలేని, తప్పు జరిగిందని కనీసం గుర్తించలేని ఆ పార్టీ నాయకులు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు అని బీజేపీ ప్రశ్నించింది.

కాంగ్రెస్ లో జేడీఎస్ విలీనం?

కాంగ్రెస్ లో జేడీఎస్ విలీనం?

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ (కేపీసీసీ) ఏర్పాటు చేసిన బ్యానర్ లో సీఎం కుమారస్వామి ఫోటో వేశారు. ఈ విషయంపై బీజేపీ నాయకులు వ్యంగాస్త్రాలు సందిస్తున్నారు. జేడీఎస్ ను కాంగ్రెస్ లో ఎప్పుడు విలీనం చేశారు ? అంటూ ప్రశ్నిస్తున్నారు.

రాహుల్ గాంధీ మహిమ!

రాహుల్ గాంధీ మహిమ!

కర్ణాటకలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభా సమావేశంలో ఏర్పాటు చేసిన బ్యానర్ ను రాహుల్ గాంధీ రాసి ఇచ్చి ఉంటారని బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మేము ఎప్పుడో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు టాటా చెప్పామని, ఇప్పుడు కన్నడిగులు కాంగ్రెస్ పార్టీకి టాటా చెబుతారని సోషల్ మీడియాలో కామెంట్లు పోస్టు చేస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ణాటకకు బదులుగా కర్ణాటట అని రాసిన బ్యానర్ ఏర్పాటు చేసి ఇటు బీజేపీ అటు కన్నడిగుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

English summary
Karnataka BJP trolls the joint election rally of the Janata Dal (Secular) and Congress held on March 31st at Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X