కర్ణాటక హోం శాఖ మంత్రిగా రామలింగా రెడ్డి, ప్రవాసాంధ్రుల ఓటు బ్యాంక్ కు కాంగ్రెస్ గాలం !

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. తన మంత్రి వర్గంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు, ఎమ్మెల్సీ హెచ్ఎం. రేవణ్ణ, గీతా మహదేవప్రసాద్, ఆర్ బి. తిమ్మాపురకు స్థానం కల్పించారు.

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. తన మంత్రి వర్గంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు, ఎమ్మెల్సీ హెచ్ఎం. రేవణ్ణ, గీతా మహదేవప్రసాద్, ఆర్ బి. తిమ్మాపురకు స్థానం కల్పించారు.

కర్ణాటక హోం శాఖ మంత్రి బాధ్యతల నుంచి కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్ తప్పుకుని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ భాద్యతలు చూసుకుంటున్నారు. డాక్టర్ జీ. పరమేశ్వర్ నుంచి హోం శాఖ బాధ్యతలు తీసుకున్న సీఎం సిద్దరామయ్య ఆ శాఖను ఆయన దగ్గరే ఇంతకాలం పెట్టుకున్నారు.

 Karnataka cabinet expansion Ramalinga Reddy Home Minister

కొత్త మంత్రి వర్గ విస్తరణ తరువాత కర్ణాటక హోం శాఖ బాధ్యతలను రామలింగా రెడ్డికి అప్పగించారు. హెచ్ఎం. రేవణ్ణకు రవాణా శాఖ బాధ్యతలు అప్పగించారు. తిమ్మాపురకు ఎక్సైజ్ శాఖ, గీతా మహదేవప్రసాద్ కు చక్కర, చిన్నతరహా పరిశ్రమల శాఖ అప్పగించారు.

సంతోష్ లాడ్ కు కార్మిక శాఖతో పాటు చేనేత పరిశ్రమల శాఖ అప్పగించారు. బెంగళూరులోని ప్రవాసాంధ్రుల ఓటర్లను ఆకర్షించడానికి రామలింగా రెడ్డి కీలకమైన హోం శాఖ బాధ్యతలు అప్పగించారని సమాచారం. మొదట హోం శాఖను విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు అప్పగిస్తారని ప్రచారం జరిగినా చివరికి ఆ పదవి రామలింగా రెడ్డి చేతికి వెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+