అనుమానాస్పదం: కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి మృతదేహం లక్నోలో లభ్యం

Subscribe to Oneindia Telugu

లక్నో: కర్నాటక కేడర్‌కు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కర్నాటకకు చెందిన అనురాగ్‌ తివారి(35) మృతదేహాన్ని బుధవారం ఉదయం లక్నోలోని హజ్రత్‌గంజ్‌ పాంతంలో పోలీసులు గుర్తించారు.

మీరాబాయి అతిథిగృహానికి సమీపంలో రహదారి పక్కన అనురాగ్‌ మృతదేహం, అతనికి సంబంధించిన వస్తువులు పడివున్నాయి. మృతదేహానికి దవడ వద్ద గాయం ఉన్నట్లు గుర్తించారు.

Karnataka cadre IAS officer Anurag Tiwari found dead in Uttar Pradesh

తివారి గత రెండు రోజులుగా మీరాబాయి అతిథి గృహంలో ఉంటున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహర్చి అనురాగ్‌ సొంతూరు. తివారి 2007లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. అతను జూన్, 2015లో బీదర్ డీసీలో పోస్టింగ్ పొందారు. మధుగిరి అసిస్టెంట్ కమిషనర్‌గా, కొడగు డిప్యూటీ కమిషనర్‌గా, బెంగళూరులో డిప్యూటీ సెక్రటరీ(ఫైనాన్స్)గా పనిచేశారాయన.

కాగా, కర్ణాటక మంత్రి ఉమశ్రీతో 2015లో తివారికీవివాదం చోటు చేసుకుంది. రైతుల నిరసనల నేపథ్యంలో మంత్రి ఉమశ్రీ.. తివారిని బయటికి లాగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అప్పుడు సంచలనంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు , దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Karnataka cadre IAS officer Anurag Tiwari was found dead in Uttar Pradesh on Wednesday morning. A 2007 batch officer was a native of Uttar Pradesh's Bahraich and has discharged duties as the Deputy Commissioner of Bidar in Karnataka.
Please Wait while comments are loading...