ఆపండి: జయలలితకు లేఖ రాసిన సిద్దు
బెంగళూరు: తమిళనాడులో కన్నడిగులపై జరుగుతున్నదాడులు వెంటనే అరికట్టాలని, దుకాణాలు, హోటళ్ల మీద దాడులు నిలిపివేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య డిమాండ్ చేశారు.

ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సోమవారం లేఖ రాశారు. తమిళనాడులో ఉన్న కన్నడిగులకు రక్షణ కల్పించాలని, వారి మీద జరుగుతున్న దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని సిద్దరామయ్య లేఖలో రాశారు.
Letter written to the Chief Minister of Tamil Nadu pic.twitter.com/GMSM0A437U
— CM of Karnataka (@CMofKarnataka) 12 September 2016
కర్ణాటకలో ఉన్న తమిళ ప్రజలకు భద్రత కల్పించే భాద్యత మాదని జయలలితకు హామి ఇచ్చారు. కన్నడిగుల మీద దాడి చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దరామయ్య లేఖ రాశారు.












Click it and Unblock the Notifications