కరోనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కేసులు.. మంత్రులు, ఎమ్మెల్యేలైనా వదలొద్దు.. కర్ణాటక సీఎం ఆదేశం
కర్ణాటకలో కరోనా విజృంభిస్తోంది. రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి నిబంధనలను కఠినతరం చేసింది. ఆంక్షలను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం బసవరాజ బొమ్మె ఆదేశించారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారు ఎంతటివారైనా సరే వెనుకడుగువేయోద్దని .. వారిపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. మహమ్మారి వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే మంత్రులపైనా కేసులు
రాష్ట్రంలో కరోనా విలయతాండం చేస్తున్న నేపథ్యం కరోనా ఆంక్షలను అమలు చేస్తున్నారు. అయితే ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రజాప్రతినిధులే మాస్క్ లు ధరించకుండా నిబంధనలను అతిక్రమిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా ఆంక్షలను తుంగలో తొక్కుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది విషయాన్ని మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మె దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం.. మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలైనా సరే ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

మాస్క్ ధరించడం ఇష్టం లేదు
కర్ణాటక మంత్రి ఉమేశ్ కట్టి బెళగావిలోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాస్క్ పెట్టుకోకుండా కన్పించారు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే మాస్క్ తనకు ఇష్టం లేదు. అందుకే పెట్టుకోవడం లేదని చెప్పడంతో అంతా విస్తుపోయారు. మాస్క్ ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ అది ప్రతి ఒక్కరి బాధ్యత మాత్రమే అని ప్రధాని మోదీ చెప్పారు అని చెప్పుకోచ్చారు. మాస్క్ ధరించడం తకు ఇష్టం లేదన్నారు . అందుకే తాను మాస్క్ పెట్టుకోలేదని పేర్కొన్నారు. సామాన్యులకు అవగాహన కల్పించాల్సిన మంత్రే ఇలా నిబంధనలు ఉల్లంఘించడంపై ప్రజలు మండిపడ్డుతున్నారు.
Recommended Video

కర్ణాటకలో కొత్తగా 41,457 కరోనా కేసులు
దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 41,457 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటి రేటు 22 శాతానికి దాటింది. వైరస్ బారిన పడి 22 మంది మరణించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం బసవరాజ బొమ్మై ఉన్నతాధికారులలో సమీక్ష నిర్విహించారు. వ్యాక్సినేషన్, కేసుల పెరుగుదలపై చర్చించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications