"సిద్ధరామయ్య మరణించారు" మెటా అనువాద లోపంపై కర్ణాటక సీఎం ఆగ్రహం
Karnataka CM Siddaramaiah: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటాకు చెందిన ఆటో-ట్రాన్స్‌లేషన్ టూల్ చేసిన తప్పుడు అనువాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడలో చేసిన ఒక పోస్టును ఆంగ్లంలోకి అనువదిస్తున్నప్పుడు ఈ టూల్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను దివంగత వ్యక్తిగా చూపించడంతో కలకలం రేగింది. ఈ పొరపాటును తక్షణమే సరిదిద్దాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. కర్ణాటక సీఎంవో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సంతాప సందేశాన్ని అనువదించేటప్పుడు మెటా ఆటోమెటిక్ ట్రాన్స్‌లేషన్ టూల్ సిద్ధరామయ్య మరణించినట్లు తప్పుగా ప్రకటించింది.
మెటా అనువాద లోపం
దక్షిణ భారత చలనచిత్ర దిగ్గజ నటి బి.సరోజా దేవి మరణంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. కన్నడ భాషలో రాసిన ఈ పోస్ట్‌లో ఆయన నటి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అయితే మెటా ఆటో-ట్రాన్స్‌లేషన్ టూల్ దీనిని ఆంగ్లంలోకి అనువదించేటప్పుడు తీవ్రమైన లోపాన్ని చేసింది. మెటా ఆటో-ట్రాన్స్‌లేషన్ టూల్ సిద్ధరామయ్య పోస్టును కన్నడ నుంచి ఆంగ్లంలోకి అనువదిస్తున్నప్పుడు ఆయనను 'దివంగత' వ్యక్తిగా పేర్కొంది. ఆంగ్లంలో ఈ పోస్ట్ "Chief Minister Siddarmaiah Passed away Yesterday..." అని అనువదించబడింది.

Someone teach basic English to CMO Karnataka. pic.twitter.com/dyUzSlrm16
— Arnab Goswami Satire (@Asksindia_) July 16, 2025
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం
ఈ తప్పుడు అనువాదంపై సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం కోరారు. మెటా తన కన్నడ ఆటో-అనువాద ఫీచర్‌ను ఖచ్చితమైనదిగా నిర్ధారించే వరకు నిలిపివేయాలని కోరారు. మెటాను ట్యాగ్ చేస్తూ.. "మెటా ప్లాట్‌ఫారమ్‌లలో కన్నడ కంటెంట్ లోపభూయిష్ట ఆటో-ట్రాన్స్‌లేషన్ వాస్తవాలను వక్రీకరిస్తోంది. వినియోగదారులను తప్పుదారి పట్టిస్తోంది. అధికారిక సంభాషణలలో ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. తక్షణమే సరిదిద్దాలని నా మీడియా సలహాదారు అధికారికంగా లేఖ కూడా రాశారు" అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
మెటాకు లేఖ
ఈ విషయమై సిద్ధరామయ్య మీడియా సలహాదారు కేవీ ప్రభాకర్ జూలై 16న మెటాకు ఈమెయిల్ పంపి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ టూల్ ఖచ్చితత్వం నిర్ధారించే వరకు కన్నడ భాషకు సంబంధించిన ఆటో-ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆయన మెటాను కోరారు.
Faulty auto-translation of Kannada content on @Meta platforms is distorting facts & misleading users. This is especially dangerous when it comes to official communications.
— CM of Karnataka (@CMofKarnataka) July 17, 2025
My Media Advisor Shri K V Prabhakar has formally written to Meta urging immediate correction.
Social… pic.twitter.com/fiCopgvt2C
-
ఏడవడానికి కూడా రేటు.. బిజినెస్ అంటే ఇతనిదే! -
ఈ పొదల మాటున నక్కిన భయంకర జంతువును గుర్తించగలరా? -
ఈ అడవిలో దాగి ఉన్న చిన్న ఎలుగుబంటి ఎక్కడుందో కనిపెట్టగలరా..? -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం












Click it and Unblock the Notifications