బాదామి నుంచి సిద్ధరామయ్య నామినేషన్: ప్రత్యర్థి శ్రీరాములు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. బాదామి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నామినేషన్ దాఖలు చేశారు.
అదే స్థానం నుంచి భాజపా తరఫున బళ్లారి లోక్‌సభ సభ్యుడు శ్రీరాములు నామినేషన్ దాఖలు చేశారు. చాముండేశ్వరి స్థానం నుంచి కూడా సిద్ధరామయ్య పోటీ చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 27 తుది గడువు. మే నెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

మే నెల 15న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలు హోరీహోరీగా సాగనున్నాయని ఓపీనియన్ పోల్స్ తమ ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే. జేడీఎస్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications