మహిళల భద్రత కోసం రూ 668 కోట్లతో సేఫ్ సిటీ కమాండ్ సెంటర్, సీఎం !

బెంగళూరు: మహిళలకు రక్షణ కల్పించాలని, అధికార పరిధిలోని ప్రాంతాలను సరిగ్గా పర్యవేక్షించాలని, నేరాల నివారణకు కృషి చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోలీసులను ఆదేశించారు. బెంగుళూరు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 'సేఫ్ సిటీ కమాండ్ సెంటర్'ను ముఖ్యమంత్రి సిద్దరామయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య మాట్లాడుతూ, ఇటువంటి సౌకర్యాల ప్రయోజనాలు ప్రజలకు చేరాలని అన్నారు.

బెంగళూరులో దోపిడీలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగి హత్యలు కూడా జరుగుతున్నాయని, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు నిర్భయ ఫండ్ కింద బెంగళూరు సేఫ్ సిటీ కమాండ్ సెంటర్ నిర్మించామని, రూ. 668 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బెంగళూరు సిటీ పోలీసులకు సూచించారు.

Karnataka CM Siddaramaiah inaugurated Bengaluru Safe City Commando Center built at a cost of 668 crores.
ఒక్కసీటు హాట్ కేక్, ఎవరు పోటీలో ఉంటారు ?, మోదీ హవానా ?, మాజీ ప్రధాని హవానా ?

ఇలాంటి సౌకర్యాలు ప్రజలకు చేరవేసి వాటిని వినియోగించుకున్నప్పుడే వాళ్లకు ఉపయోగపడతాయని, రూ.668 కోట్లతో కమాండ్ సెంటర్‌ను నిర్మించారని, ఇంత ఖర్చు చేసి నిర్మించిన బెంగళూరు సేఫ్ సిటీ కమాండ్ సెంటర్ కు ఆశించిన ఫలితాలు రాకపోతే కష్టమేనని సీఎం సిద్దరామయ్య అన్నారు.

బెంగళూరు నగరం అందరికీ సురక్షితంగా ఉండేలా ఒంటరి మహిళలు నివసించే వ్యక్తిగత ఇళ్లు, నివాసాలపై నిఘా ఉంచాలని సీఎం సిద్ధరామయ్య బెంగళూరు సిటీ పోలీసులను ఆదేశించారు.

బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ను సులభతరం చేయడంపై దృష్టి సారించాలని, తమ పరిధిలోని మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. నేరం తర్వాత శిక్ష ఒక భాగం. అయితే నేరాలను అరికట్టాలి. మహిళల రక్షణకు కృషి చేయాలి. పోలీసులు తమ పరిధిలో మరింత అప్రమత్తంగా ఉండాలి సీఎం సిద్దరామయ్య అన్నారు.

Karnataka CM Siddaramaiah inaugurated Bengaluru Safe City Commando Center built at a cost of 668 crores.
బెంగళూరు నగరంలో తొలిసారిగా కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశామని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సీఎం సిద్దరామయ్య మహిళలకు మనవి చేశారు. పోలీసులు మహిళలకు రక్షణ కల్పించాలని, వారి పరిధిలో గట్టి నిఘా ఉంచాలని అన్నారు. బెంగళూరు సురక్షిత నగరంగా మారాలి' అని సీఎం సిద్దరామయ్య అన్నారు.

సెంటర్‌లో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశామని, ఇవన్నీ ఉపయోగకరంగా ఉండాలన్నాని, బెంగళూరు కమాండ్ సెంటర్ కారణంగా ఇక ముందు బెంగళూరు నిజంగా సురక్షితమైన నగరంలా కనిపిస్తుందని, బెంగళూరు పోలీసులకు కూడా మంచి పేరు వస్తుందని సీఎం సిద్దరామయ్య అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+