రెండు పార్టీల నెత్తిన బండరాయి వేసిన సీఎం, అదే జరిగితే టూలెట్ బోర్డు గ్యారెంటీ అంటూ !

రానున్న రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలోని బీజేపీ, జేడీఎస్‌ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు స్వచ్ఛందంగా కాంగ్రెస్‌లో చేరతారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య స్వయంగా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని బాంబు పేల్చారు.

ఈ ఆపరేషన్‌ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదని, అధికార పార్టీ ఒత్తిడి లేకుండానే బీజేపీ, జేడీఎస్‌ పార్టీలకు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో సహా పలువురు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఆపరేషన్ హస్తం చేసే ప్రసక్తే లేదని, ఎవరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా మా పార్టీలో చేర్చుకుంటామని, ఎవ్వరి మీద తాము ఒత్తిడి చెయ్యలేదని సీఎం సిద్దరామయ్య అన్నారు.

Karnataka CM Siddaramaiah made sensational comments that BJP and JDS MLAs will join Congress.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, నాయకత్వాన్ని ఎవరు అంగీకరించినా, కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని, ఎవ్వరిని మేము కాదనలేమని సీఎం సిద్దరామయ్య చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన అల్పాహార విందు, ఆ తరువాత జరిగిన సమావేశం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం సిద్దరామయ్య ఆయన స్టైల్లో సమాధానమిచ్చారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకుంటుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని సీఎం సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలోని ఒక్కో జిల్లాకు ఒక మంత్రిని పరిశీలకుడిగా నియమించామని, జిల్లా ఇన్ ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఇప్పటికే సూచించామని సీఎం సిద్దరామయ్య అన్నారు.

Karnataka CM Siddaramaiah made sensational comments that BJP and JDS MLAs will join Congress.
కరువు పరిస్థితుల నిర్వహణ బాధ్యతను కూడా జిల్లా ఇన్ చార్జ్ మంత్రులకు అప్పగించామని సీఎం సిద్దరామయ్య మీడియాకు చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు లేదా ఆ తర్వాత అయినా ముఖ్యమంత్రులు మారతారని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బపవరాజ్ పాటిల్ యత్నాల్ చేసిన వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

బీజేపీ నాయకులకు మా ప్రభుత్వం గురించి, మా పార్టీ నాయకుల గురించి మాట్లాడే హక్కు లేదని, ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోలేని బీజేపీ నేతలు మా పార్టీ విషయంపై ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారో మాకు అర్దం కావడం లేదని, మా పార్టీ నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని సీఎం సిద్దరామయ్య అన్నారు. మొత్తం మీద త్వరలోనే బీజేపీ, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ లో చేరుతారని స్వయంగా సీఎం సిద్దరామయ్య చెప్పడంతో ఆ పార్టీలకు చెందిన నాయకులు హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+