Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం కుర్చీ అంటే పూలపాన్పు స్థానం కాదు, ఆ సీటు గురించి వివరించిన సీఎం !

బెంగళూరు/మైసూరు: ఇది నా చివరి ఎన్నికలు. అయితే నాకు ఊపిరి ఉన్నంత వరకు క్రియాశీల రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. శనివారం మైసూరు జిల్లాలోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన కృతజ్ఞతా సభలో సీఎం సిద్దరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా సిద్దరామయ్య మాట్లాడుతూ నియోజకవర్గ ఓటర్లకు వింధు భోజనం పెట్టి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం సిద్దరామయ్య మాట్లాడుతూ 2013లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చెప్పినట్లు చేసి అన్ని కులాలు, మతాలు, సమాజంలోని అన్ని వర్గాల తరపున సంక్షేమ కార్యక్రమం రూపొందించాను. ఈ సారి మా ప్రభుత్వం కర్ణాటకకు మరింత సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అందిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు.

 siddaramaiah

అవినీతి, నిర్వహణలోపం, అభివృద్ధిలోపం, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే దుర్మార్గపు రాజకీయాలను (బీజేపీని) కర్ణాటక ప్రజలు ఓడించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని సీఎం సిద్దరామయ్య అన్నారు. బీజేపీని ఓడించిన కర్ణాటక ప్రజలకు తాను కృతజ్ఞుడను అని సీఎం సిద్దరామయ్య అన్నారు. బసవుడి ఆదర్శాలతో తాను పని చేస్తానని, బసవ జయంతి రోజున తొలిసారిగా నేను ముఖ్యమంత్రిగా ప్రమాణంస్వీకారం చేశానని సీఎం సిద్దరామయ్య చెప్పారు.

ముఖ్యమంత్రి కుర్చీ సంతోషం కలిగించే పూలపాన్పు కుర్చీ కాదని, తనకు వచ్చిన సీఎం పదవితో ప్రజల జీవితాలను మెరుగుపరిచే అవకాశంగా భావిస్తున్నానని సిద్దరామయ్య అన్నారు. కాంగ్రెస్ హామీలను అమలు చెయ్యలేక కర్ణాటక రాష్ట్రం దివాళా తీస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆ రోజు ఆరోపించారని, ఇప్పుడు మేము ఇచ్చిన ఐదు హామీలను అమలు చేస్తామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఒక పథకాన్ని ప్రకటించినప్పుడు, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే మా ప్రణాళికకు ప్రధాని మోడీ సహకరించాలి. కానీ మోదీ పేద, మధ్యతరగతి వర్గాల ప్రగతి, అభివృద్ధిని కోరుకోవడం లేదని సిద్దరామయ్య ఆరోపించారు.

అందుకే బీజేపీ సంప్రదాయం ప్రకారం అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని సిద్దరామయ్య ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రంలోని మహిళలందరికీ ఎక్స్‌ప్రెస్‌తో పాటు అన్ని బస్సుల్లో కర్ణాటకలోనే ఉచిత ప్రయాణం కల్పించేందుకు శక్తి పథకాన్ని ప్రారంభిస్తున్నామని, శక్తి పథకం సవ్యంగా అమలు కావడానికి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారని సీఎం సిద్దరామయ్య అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+