సీఎం సిద్దూకు ఓటమి భయం, రెండు చోట్ల పోటీ, క్లారిటీ ఇచ్చిన కుమారుడు, డేట్ ఫిక్స్ !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గం నుంచి కాకుండా బాగల్ కోటే జిల్లా బాదామిలో పోటీ చేస్తారని స్పష్టంగా వెలుగు చూసింది. ఇంత కాలం ఒకే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని అనుకున్న ప్రజలకు స్వయంగా సీఎం సిద్దరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర క్లారిటీ ఇచ్చారు.

సీఎంకు భయం !
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. చాముండేశ్వరి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్యకు ఓటమి ఎదురయ్యే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారని సమాచారం.

అధిష్టానం ఆలోచన
చాముండేశ్వరి నియోజక వర్గంతో పాటు బాగల్ కోటే జిల్లాలోని బాదామి నియోజక వర్గంలో పోటీ చెయ్యాలని సీఎం సిద్దరామయ్య నిర్ణయించారు. అయితే రెండు చోట్ల సీఎం పోటీ చేస్తే పార్టీ కార్యకర్తల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని, ఒకే నియోజక వర్గంలో పోటీ చెయ్యాలని సిద్దరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించిందని తెలిసింది.

సీఎం కుమారుడు క్లారిటి !
ఈనెల 23వ తేదీ బాగల్ కోటే జిల్లా బాదామి శాసన సభ నియోజక వర్గంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య నామినేషన్ వేస్తారని ఆయన కుమారుడు, మైసూరు జిల్లా వరుణ శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ యతీంద్ర ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

రెండు నియోజక వర్గాలు !
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గంతో పాటు బాగల్ కోటే జిల్లా బాదామి శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని స్వయంగా ఆయన కుమారుడు డాక్టర్ యతీంద్ర సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.

సీఎంకు గట్టి పోటీ !
మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజక వర్గం ఎమ్మెల్యే జీటీ. దేవేగౌడ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గట్టిపోటీ ఇస్తున్నారు. సీఎం సిద్దరామయ్య శుక్రవారం చాముండేశ్వరి నియోజక వర్గంలో నామినేషన్ వెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications