వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేల లీడర్, చర్చలు, డిమాండ్లు, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫతాల లెక్కింపుకు ఒక్క రోజు గడువు ఉన్న సందర్బంలో ఆ పార్టీ నాయకుల్తో ఉత్సాహం మొదలైయ్యింది. కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో అసమ్మతి ఎమ్మెల్యేల తీరుతో ఆ పార్టీ నాయకులు హడలిపోతున్నారు.

కాంగ్రెస్ అసమ్మతి నేతలకు నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి ఢిల్లీ పయనం అయ్యారు. పలు జాతీయ సర్వేల ప్రకారం కర్ణాటకలో అధిక సంఖ్యలో బీజేపీ స్థానాలు కైవసం చేసుకోనుంది. ఈ నేపద్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ రాజకిహోళి ఢిల్లీ హైకమాండ్ తో భేటీ కానున్నారని సమాచారం.

బెంగళూనులో చర్చలు

బెంగళూనులో చర్చలు

కాంగ్రెస్ లోని పలువురు అసమ్మతి ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి రమేష్ జారకిహోళి ఢిల్లీకి వెళ్లే ముందు బెంగళూరులో పలువురు నేతలతో చర్చలు జరపనున్నారు. రమేష్ రాజకిహోళి ఢిల్లీ వెళ్లిన తరువాత అసమ్మతి ఎమ్మెల్యేలను అక్కడికి పిలుపించుకునే అవకాశం ఉందని సమాచారం.

ఫలితాల తరువాత జంప్

ఫలితాల తరువాత జంప్

లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశం ఉంది. రమేష్ జారకిహోళి ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత సీపీ. యోగేశ్వరతో భేటీ అయ్యారని సమాచారం. హైకమాండ్ సూచన మేరకు సీపీ. యేగేశ్వర్ తో రమేష్ జారకిహోళి చర్చించారని తెలిసింది. సీపీ. యోగేశ్వర్ తో సహ బీజేపీ సీనియర్ నాయకుడు బాలచంద్ర జారకిహోళి సైతం రమేష్ జారకిహోళితో చర్చించారని సమాచారం.

ఎమ్మెల్యేల సంఖ్య

ఎమ్మెల్యేల సంఖ్య

రమేష్ జారకిహోళి ఢిల్లీ వెళ్లిన తరువాత అసమ్మతి ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని సమాచారం. రమేష్ జారకిహోళి ఢిల్లీ వెళ్లిన తరువాత కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు ఢిల్లీ వెలుతారని, తరువాత వారు బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. సర్వేలు అన్ని బీజేపీకి అనుకూలంగా వచ్చిన సందర్బంలో కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు ఒక అంచనాకు వచ్చారని తెలిసింది.

భిన్నాభిప్రాయాలు

భిన్నాభిప్రాయాలు

లోక్ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఎక్కవ అయ్యాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత అసమ్మతి రాగం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల అసమ్మతిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ సిద్దం అయ్యింది. అసమ్మతి ఎమ్మెల్మేలతో బీజేపీ నాయకులు ఇప్పటికే టచ్ లో ఉన్నారు.

ఐదు మంది ఎమ్మెల్యేలు

ఐదు మంది ఎమ్మెల్యేలు

మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో ఇప్పటికే ఐదు మంది అసమ్మతి ఎమ్మెల్యేలు మంతనాలు జరిపారని తెలిసింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత అసమ్మతి ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కవ అయ్యే అవకాశం ఉంది. అసమ్మతి ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న రమేష్ జారకిహోళి ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకులతో చర్చలు జరిపి వారి డిమాండ్ల గురించి చర్చించే అవకాశం ఉంది.

English summary
Congress dissedent MLA Ramesh Jarkiholi going to Delhi. He may meet BJP high command. worries build for coalition government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X