Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమానుషం : ఆ దళిత కుటుంబానికి రూ.25వేలు జరిమానా-చిన్నారి ఆలయంలోకి ప్రవేశించినందుకు..

సమాజంలో ఇప్పటికీ కుల వివక్ష,వెలివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. దళితులను గుడిలోకి రానివ్వని ఘటనలు,సాంఘీక బహిష్కరణలు ఇప్పటికీ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటకలోని మియాపూర్ గ్రామంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దళిత కుటుంబానికి చెందిన రెండేళ్ల ఓ చిన్నారి స్థానిక ఆలయంలోకి ప్రవేశించినందుకు అక్కడి అగ్ర కులస్తులు కన్నెర్రజేశారు. ఆ కుటుంబానికి రూ.25వేలు జరిమానా విధించారు.

ఈ ఘటనపై స్థానికులు మాట్లాడుతూ... ఈ నెల 4న ఆ చిన్నారి కుటుంబం స్థానిక దేవాలయం వద్దకు వెళ్లారని చెప్పారు.చిన్నారి పుట్టినరోజు కావడంతో దేవుడికి మొక్కుకునేందుకు అక్కడికి వెళ్లారని తెలిపారు. తండ్రి బయటి నుంచే దేవుడికి మొక్కుతుండగా... ఆ చిన్నారి ఆలయం లోపలికి పరిగెత్తాడని చెప్పారు.దీంతో ఆలయ పూజారి ఆగ్రహం వ్యక్తం చేశాడని... విషయం గ్రామంలోని అగ్రకులాలకు తెలియజేయడంతో ఆ కుటుంబానికి రూ.25వేలు జరిమానా విధించారని తెలిపారు.దళితుల ప్రవేశంతో మైలపడ్డ ఆలయాన్ని శుద్ది చేసేందుకే జరిమానా విధించినట్లు చెప్పారని వెల్లడించారు.

karnataka dalit family imposed rs 25000 fine after their child enters into temple

'ఆరోజు మా బాబు పుట్టినరోజు. మా ఇంటి ముందున్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి దేవుడికి మొక్కుకోవాలనుకున్నాం.బయటి నుంచి దేవుడికి మొక్కుతున్న సమయంలో వర్షం మొదలైంది.దీంతో బాబు ఆలయం లోపలికి పరిగెత్తాడు.' అని ఆ చిన్నారి తండ్రి వెల్లడించాడు. ఆ గ్రామంలో దళిత కుటుంబానికి ఆలయంలోకి ప్రవేశం లేదని చెబుతున్నారు.

ఈ ఘటన గురించి తెలిసి దళిత సామాజికవర్గమైన చన్నదసర్ కమ్యూనిటీ స్థానికంగా నిరసనలకు దిగింది.ఇప్పటికైతే బాధిత దళిత కుటుంబం తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు వెల్లడించారు.గ్రామంలో ఎలాంటి గొడవలు జరగవద్దన్న ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని బాధిత కుటుంబం వెల్లడించడం గమనార్హం.

Recommended Video

    Karnataka Scorpion Festival : విష పురుగులతో గేమ్స్.. భారీగా జనాలు || Oneindia Telugu

    దేశవ్యాప్తంగా ఇప్పటికీ చాలాచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఓవైపు దేశం అత్యాధునిక ఆవిష్కరణలు,టెక్నాలజీలో దూసుకుపోతుంటే... మరోవైపు ఇప్పటికీ కుల జాఢ్యం దేశాన్ని పట్టి పీడిస్తూనే ఉంది.ముఖ్యంగా దళితులపై వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.ఇటీవల వినాయక చవితి సందర్భంగా పలుచోట్ల దళితులపై దాడులు జరిగిన ఘటనలు వెలుగుచూశాయి. ఇక కులాంతర వివాహాలు చేసుకునే జంటల్లో దళిత యువకులు హత్యలకు గురవుతున్న ఘటనలు కూడా ఇప్పటికీ చోటు చేసుకుంటుండటం కుల వివక్ష ఎంత తీవ్రంగా ఉన్నదో బయటపెడుతున్నది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+