బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సొంత పార్టీ ఓడిపోతే ఉప ముఖ్యమంత్రి హ్యాపీ, కొంచెం టైం ఉంది, దానికో లేక్కుంది, కుర్చీ సేఫ్?!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో జరిగిన 15 శాసన సభ నియోజక వర్గాల్లో బీజేపీ తన సత్తాచూటుకుంది. ఉప ఎన్నికల్లో బెంగళూరులోని శివాజీనగర నియోజక వర్గంలో బీజేపీ ఓడిపోవడంతో అందరూ షాక్ కు గురైనారు. అయితే ఉప ఎన్నికల్లో సొంత పార్టీ (బీజేపీ) ఓడిపోతే అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని, ఆయన హ్యాపీ అని సమాచారం. బీజేపీ ఓడిపోయినా ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది సంతోషంగా ఉండటానికి ఓ లెక్కుందని, ఆయనకు కొంచెం టైం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. బెంగళూరు శివాజీనగర్ లో మాత్రం తాము విజయం సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ కనీసం ఊహించలేదని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు.

ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

శివాజీనగర్ లో బీజేపీకి ఊహించని దెబ్బ !

శివాజీనగర్ లో బీజేపీకి ఊహించని దెబ్బ !

బెంగళూరు నగరంలోని శివాజీనగర ఉప ఎన్నికల్లో బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తిగింది. శివాజీనగర అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్ కు బీజేపీ టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించిన ఆ పార్టీ హై కమాండ్ ఎం. శరవణకు ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అవకాశం ఇచ్చింది. అయితే ఎం. శరవణ మీద పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రిజ్వాన్ అర్హద్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

డీసీఎం ఫుల్ హ్యాపీ ?!

డీసీఎం ఫుల్ హ్యాపీ ?!

శివాజీనగరలో సొంత పార్టీ అభ్యర్థి ఎం. శరవణ ఓడిపోయినా ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది చాలా సంతోషంగా ఉన్నారని తెలిసింది. సొంత పార్టీ అభ్యర్థి ఓడిపోతే ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదికి ఎందుకు సంతోషం ? అంటే దానికి ఓ కారణం ఉంది. బీజేపీ మీద పోటీ చేసి ఎమ్మెల్యే అయిన రిజ్వాన్ అర్హద్ అంతుకు ముందు ఎమ్మెల్సీ. ఆరు నెలల్లో రిజ్వాన్ అర్షద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉంది.

ఉప ముఖ్యమంత్రికి ఆ చాన్స్ లేదు

ఉప ముఖ్యమంత్రికి ఆ చాన్స్ లేదు

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లక్షణ సవది గత శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయారు. ఎమ్మెల్యే కాక పోయినా లక్ష్మణ సవదిని ఉప ముఖ్యమంత్రి పదవి చేశారు. అయితే ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి లక్ష్మణ సవదికి బీజేపీ హైకమాండ్ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు లక్ష్మణ సవది ఉప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే ఎమ్మెల్యే కావాలి. అయితే ప్రస్తుతం ఆ చాన్స్ లేదు. కనీసం ఎమ్మెల్సీ అయినా ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది కుర్చీ భద్రంగా ఉంటుంది.

డీసీఎం సంతోషానికి ఓ లెక్కుంది

డీసీఎం సంతోషానికి ఓ లెక్కుంది

శివాజీనగర్ లో ఎమ్మెల్సీ రిజ్వాన్ అర్షద్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయన త్వరలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యాల్సి ఉంది. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం నుంచి తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఇప్పటి నుంచి లక్ష్మణ సవది ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే బీజేపీ ఓడిపోయినా ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది తాను ఎమ్మెల్సీగా పోటీ చెయ్యడానికి అవకాశం చిక్కిందని సంతోషంగా ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

రెండు నెలలు టైం

రెండు నెలలు టైం

ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది ఆరు నెలల్లో ఎమ్మెల్యే కానీ లేదా ఎమ్మెల్సీ కాని గెలిస్తేనే ఆయన ఆ పదవిలో కొనసాగడానికి అవకాశం ఉంది. వచ్చే రెండు నెలల్లో లక్ష్మణ సవది కనీసం ఎమ్మెల్సీగా విజయం సాధిస్తేనే ఆయన కుర్చీ భద్రంగా ఉంటుంది. లక్ష్మణ సవది ఎమ్మెల్సీగా పోటీ చెయ్యడానికి బీజేపీ హైకమాండ్ అవకాశం ఇస్తుందా ? లేదా ? అనే విషయం వేచి చూడాలి అంటున్నాయి ఆ పార్టీ అవర్గాలు

English summary
Bengaluru: In a 15 seat by elections Congress candidate Rizwan Arshad won Shivajinagar assembly seat. Deputy chief minister of Karnataka Lakshman Savadi happy with result.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X