• search

హంగ్ ఏర్పడితే: మోదీ, అమిత్ షా మార్క్ పాలిటిక్స్.. రాహుల్‌‌కు తప్పదు అవమానం

By Rajababu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   If Karnataka Elections 2018 Verdict is Hung,Then What is Modi Politics???

   దేశ రాజకీయ భవిష్యత్తుకు నిర్ణాయకంగా మారిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఆది నుంచే రసవత్తరంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన విధంగానే కన్నడనాట హంగ్ ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. తాజా ఫలితాల్లో ఏకంగా సీఎం సిద్ధరామయ్య పోటీ చేసిన రెండు చోట్ల తన సమీప ప్రత్యర్థుల చేతిలో వెనకబడి ఉన్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే కర్ణాటక రాజకీయాల్లో కొన్ని రోజులపాటు అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది. రాజకీయ సంక్షోభం కొనసాగితే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, బీజేపీలో ఇలా ఉండవచ్చనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వెల్లడవుతున్నది.

   కాంగ్రెస్ అతిపెద్ద రాజకీయపార్టీగా అవతరిస్తే

   కాంగ్రెస్ అతిపెద్ద రాజకీయపార్టీగా అవతరిస్తే

   రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఇతర రాష్ట్రాల్లో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఆశలు చిగురిస్తాయి.
   అలాగే రాజకీయపరంగా రాహుల్‌గాంధీ దేశానికి భవిష్యత్ నేతగా మారుతాడు.
   కాంగ్రెస్‌కు గత వైభవాన్ని తెచ్చిన నేతగా సిద్దరామయ్యకు మంచి క్రెడిట్ దక్కుతుంది.
   రానున్న రోజుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు మంచి జోష్ లభిస్తుంది.

   కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు దక్కించుకోకపోతే

   కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు దక్కించుకోకపోతే

   సిద్దరాయయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి జేడీ(ఎస్) నేత కుమార్‌స్వామి మద్దతు ఇవ్వకపోవచ్చు.
   కాంగ్రెస్ దళిత సీఎం కార్డును కర్ణాటకలో ఉపయోగించి జేడీ(ఎస్) మద్దతు కూడగట్టుకోవచ్చు.
   దళిత సీఎం అంటే లోకసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖార్గే, పరమేశ్వర రేసులోకి రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
   కాంగ్రెస్‌కు షరతులతో కూడిన మద్దతును జేడీఎస్ ఇవ్వడానికి అవకాశం లేకపోలేదు.

   బీజేపీ అత్యధిక స్థానాలు సంపాదిస్తే

   బీజేపీ అత్యధిక స్థానాలు సంపాదిస్తే

   బీజేపీ అత్యధిక స్థానాలు సంపాదించి, పూర్తిస్థాయి మెజారిటీకి తగిన సీట్లు లేకపోతే పరిస్థితులు ఇలా ఉంటాయి.
   ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలు రంగంలోకి దూకి తమ దైన వ్యూహాలను అమలు చేసే ఛాన్సు ఉంది.
   కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ తన శక్తియుక్తులను ఉపయోగించవచ్చు.
   ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి జేడీఎస్ మద్దతు ఇవ్వడానికి ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది.
   కుమారస్వామి డిప్యూటీ సీఎంగా బీజేపీ ప్రయత్నం ఏర్పడే అవకాశం ఉంది.

   బీజేపీ, కాంగ్రెస్‌కు పోటాపోటీగా స్థానాలు వస్తే

   బీజేపీ, కాంగ్రెస్‌కు పోటాపోటీగా స్థానాలు వస్తే

   కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మంచి అవకాశాలు ఏర్పడుతాయి.
   జేడీఎస్‌ను చీల్చే రాజకీయ వ్యూహాన్ని కాంగ్రెస్ అమలు చేయవచ్చు.
   రిస్టార్టుల్లో క్యాంపు రాజకీయాలు జోరు పెరగవచ్చాయి
   జేడీఎస్ కింగ్ మేకర్‌గా మారవచ్చు.

    బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ లభిస్తే

   బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ లభిస్తే

   దేశవ్యాప్తంగా మోదీ, అమిత్‌షా హవా కొనసాగుతుంది
   దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ అస్థిత్వంపై అనుమానాలు పెరిగిపోతాయి.
   రాహుల్ గాంధీ నాయకత్వంపై విమర్శలు చెలరేగుతాయి.
   మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీకి ఎదురేలేకుండా పోవచ్చు.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   The BJP and the Congress are neck and neck in Karnataka, where votes cast on Saturday are being counted. Whether Prime Minister Narendra Modi's BJP will win back its gateway to south India, reducing the Congress to "PPP" or "Punjab, Puducherry or Parivar" - as PM Modi jibed - or whether the Congress will beat the odds to retain a major state, handing Rahul Gandhi his first triumph since he took charge of the party last December, will be known shortly. The regional party Janata Dal Secular (JDS) is looking to win enough seats to play kingmaker in a hung assembly.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   Notification Settings X
   Time Settings
   Done
   Clear Notification X
   Do you want to clear all the notifications from your inbox?
   Settings X
   X
   ఎన్నికల ఫలితాలు 
   మధ్యప్రదేశ్ - 230
   PartyLW
   CONG03111
   BJP06103
   IND14
   OTH20
   రాజస్థాన్ - 199
   Party20182013
   CONG9921
   BJP73163
   IND137
   OTH149
   ఛత్తీస్‌గఢ్ - 90
   PartyLW
   CONG0662
   BJP114
   BSP+25
   OTH00
   తెలంగాణ - 119
   Party20182014
   TRS8863
   TDP, CONG+2137
   AIMIM77
   OTH39
   మిజోరాం - 40
   Party20182013
   MNF265
   IND80
   CONG534
   OTH10
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more