కాంగ్రెస్-జేడీఎస్‌కు అమిత్ షా షాక్: తెరపైకి దేవేగౌడ కొడుకు రేవణ్ణ, ప్రభుత్వ ఏర్పాటుకు యెడ్డీ సిద్ధం
బెంగళూరు: కర్నాటక రాజకీయాల్లో మరో ఊహించని పరిణామం. జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయమైంది. ఇలాంటి తరుణంలో మరో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తమకు జేడీఎస్ నేత రేవణ్ణ మద్దతు ఉందని చెబుతూ బీజేపీ నేత యెడ్యూరప్ప గవర్నర్‌ను కలిశారు.
Recommended Video

రేవణ్ణ.. జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ దేవేగౌడ పెద్ద కొడుకు. కుమారస్వామితో ఓ వైపు కాంగ్రెస్ మాట్లాడి, పదవులు పంచుకొని, గవర్నర్ భవన్ వెళ్ళి ప్రభుత్వానికి ఆహ్వానించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించుకున్నాయి.

అంతలోపే యెడ్యూరప్ప రేవణ్ణను తెరపైకి తీసుకు వచ్చారు. రేవణ్ణతో పాటు తమకు 12 మంది జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ యెడ్డీ గవర్నర్‌ను కలవడం ఆసక్తికరం.
ఉదయం నుంచి కర్నాటకలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ స్పష్టమైన మెజార్టీ అధికారంలోకి వస్తుందని భావించేలోపు జేడీఎస్ - కాంగ్రెస్ అధికారం దక్కించుకునేందుకు చకచకా పావులు కదిపాయి.
అంతలోపే యెడ్యూరప్ప రేవణ్ణతో పాటు పన్నెండు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. ఇది మరో ఊహించని పరిణామం. అయితే, దీనిపై రేవణ్ణ, మిగతా పన్నెండు మంది శాసన సభ్యులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కాగా, తనకు రేవణ్ణతో పాటు 12 మంది ఎమ్మెల్యేల మద్దతుందని యెడ్యూరప్ప గవర్నర్‌ను కలిసి, తనకు బలం నిరూపించుకునేందుకు సమయం కావాలని అడిగారు. గవర్నర్ ఆయనకు వారం రోజుల సమయం ఇచ్చారు. వారం రోజుల్లో యెడ్డీ బలం నిరూపించుకోవాలి.
కాగా, అమిత్ షా మార్క్ రాజకీయం కర్నాటకలోను బీజేపీ ఉపయోగించిందని అంటున్నారు. కాంగ్రెస్ ఎత్తుకు బీజేపీ అధినేత పైఎత్తు వేశారని అంటున్నారు. అందులో భాగంగానే తమకు మెజార్టీ వచ్చినా జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటంతో జేడీఎస్‌లోని కొందరితో అంతకుముందే మాట్లాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మార్గం సుగమం చేసుకున్నారా అనే చర్చ సాగుతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications