చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన కర్ణాటక పోలింగ్, 15న ఫలితాలు

బెంగళూరు: కన్నడ ఓటరు ఏం తీర్పు చెప్పబోతున్నాడు!.. కమలం కర్ణాటకలోనూ వికసిస్తుందా?.. లేక హస్తానికే మళ్లీ పట్టం కట్టి ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీని కన్నడ ఓటర్లు బ్రేక్ చేస్తారా?.. ఈ ప్రశ్నలన్నింటికీ నేటి పోలింగ్ తో సమాధానం దొరకనుంది.

Recommended Video

    Karnataka Election 2018 Update

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికలు రానే వచ్చాయి. శనివారం 222 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 2600మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. మే 15న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

    karnataka elections 2018 live updates voting begins today

    నేటి ఎన్నికల్లో దాదాపు 55,600 పోలింగ్‌ బూత్‌ల్లో పోలింగ్ జరగగా, మూడున్నర లక్షల మంది సిబ్బంది పర్యవేక్షణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉండటంతో కన్నడ ఓటరు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నాడన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

    కొత్త చరిత్రకి నాంది పలుకుతారా?

    గత కర్ణాటక ఎన్నికలను పరిశీలించినట్టయితే 1985నుంచి ఇప్పటిదాకా కన్నడ ఓటరు ఏ పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టలేదు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆ సాంప్రదాయాన్ని బద్దలు కొడుతామన్న ధీమాతో ఉంది. మరోవైపు 130 పైచిలుకు స్థానాలను కైవసం చేసుకుని చరిత్రను పునరావృతం చేయబోతున్నామని బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

    May 12, 2018, 6:14 pm IST

    రామనగర్‌లో అత్యధికంగా 84శాతం, బెంగళూరు అర్బన్‌లో అల్పంగా 44శాతం ఓటింగ్ నమోదైంది.
    May 12, 2018, 6:07 pm IST

    చెదురుమదురు ఘటనలు మినహా కర్ణాటక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
    May 12, 2018, 6:06 pm IST

    మొత్తంగా 70శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది.
    May 12, 2018, 6:05 pm IST

    శనివారం సాయంత్రం 5గంటల వరకు 64శాతం పోలింగ్ నమోదైంది.
    May 12, 2018, 4:55 pm IST

    హుబ్లీలో వర్షం కారణంగా ప్రజలు ఓటు వేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఓటింగ్ శాతంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది.
    May 12, 2018, 4:18 pm IST

    కల్బుర్గి జిల్లాలోని చిత్తాపూర్ తాలూకాలోని తర్కాస్పేట్ గ్రామంలోని మెజార్టీ ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాన్ని పంచాయతీ కేంద్రంగా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
    May 12, 2018, 3:47 pm IST

    కలబుర్గిలో తీవ్రమైన ఎండల కారణంగా మధ్యాహ్నం నుంచి ఓటింగ్ శాతం తగ్గిపోయింది.
    May 12, 2018, 3:45 pm IST

    మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత ఎస్ఎం కృష్ణ బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
    May 12, 2018, 3:44 pm IST

    ధర్వాడ్‌లో ఓటు వేసేందుకు వచ్చిన నవ వధూవరులు.
    May 12, 2018, 3:43 pm IST

    ధర్వాడ్‌లోని నవల్‌గుండులో ఓటు వేసేందుకు బారులు తీరిన జనం.
    May 12, 2018, 3:22 pm IST

    శనివారం మధ్యాహ్నం 3గంటల వరకు 53శాతం ఓటింగ్ నమోదైంది.
    May 12, 2018, 3:13 pm IST

    కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన బాదామి, చాముండేశ్వరి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.
    May 12, 2018, 2:04 pm IST

    మధ్యాహ్నాం ఒంటిగంట వరకు కర్ణాటకలో 37శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.
    May 12, 2018, 1:44 pm IST

    'ఎన్నికల్లో జేడీఎస్ భారీ ఎత్తున డబ్బులు పంచింది. వాళ్ల అభ్యర్థి తానో సొసైటీ సెక్రటరీ అని చెబుతున్నారు.. అలాంటప్పుడు ఆయనకు అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది?. అదిగాక బీజేపీ జేడీఎస్ కు బహిరంగంగానే మద్దతు తెలుపుతోంది. అందుకే ఓ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది' అని చాముండేశ్వరి నియోజకవర్గంలో సిద్దరామయ్య మీడియాతో పేర్కొన్నారు.
    May 12, 2018, 1:32 pm IST

    కర్ణాటక మంత్రి డీకె శివకుమార్ కనకపురలోని 240 పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్ లో నిలుచుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
    May 12, 2018, 1:07 pm IST

    కర్ణాటక లోకాయుక్త మాజీ జస్టిస్ సంతోష్ హెగ్దే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఎన్నికల్లో ప్రలోభాలు పెరిగాయని నేను అనుకుంటున్నాను. చీరలు, డబ్బు, నగదు, మందు, ధోతీలు, కుక్కర్స్ వంటివి బహిరంగంగానే పంపిణీ చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు' అని అభిప్రాయపడ్డారు.
    May 12, 2018, 1:01 pm IST

    హంపి నగర్ పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ కార్పోరేటర్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని అయినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు.
    May 12, 2018, 12:43 pm IST

    'యడ్యూరప్ప మానసికంగా డిస్టర్బ్ అయ్యారు. కాంగ్రెస్ కచ్చితంగా 120 పైచిలుకు స్థానాలను గెలుచుకుంటుంది. నేను గట్టి నమ్మకంతో ఉన్నా' అని సీఎం సిద్దరామయ్య మీడియాతో చెప్ాపరు.
    May 12, 2018, 12:29 pm IST

    కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నామని సీఎం సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు.
    May 12, 2018, 12:28 pm IST

    బీజేపీ ఉపముఖ్యమంత్రి అభ్యర్థి బి.శ్రీరాములు బళ్లారిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాదామి నియోజకవర్గంలో సీఎం సిద్దరామయ్యపై ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే
    May 12, 2018, 12:03 pm IST

    కల్బుర్గీ: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే బసవనగర్ లోని 108 పోలింగ్ బూత్ వద్ద తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
    May 12, 2018, 11:51 am IST

    కర్ణాటకలో ఎన్నికల నియామవళి అమలులో ఉన్నవేళ.. ప్రధాని మోడీ ఓటర్లను ప్రభావితం చేయడానికి నేపాల్ గుళ్లలో పూజలు చేస్తున్నారు. ఇదంతా ఓటర్లను ప్రభావితం చేయడానికే. ప్రజాస్వామ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదు. ఈరోజే ఎందుకు ఆయనకు పూజలు చేయాలనిపించింది? అని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు.
    May 12, 2018, 11:31 am IST

    జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి కుమారస్వామి, ఆయన భార్య అనిత రామనగరలోని పోలింగ్ బూత్ వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు. జేడీఎస్ సొంతంగా మేజిక్ ఫిగర్ సాధిస్తుందని ఈ సందర్భంగా కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు.
    May 12, 2018, 11:16 am IST

    కర్ణాటక ఎన్నికల్లో ఉదయం 11గంటల వరకు 24శాతం ఓటు నమోదైంది.
    May 12, 2018, 10:56 am IST

    ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ కనకపురలోని పోలింగ్ బూత్ వద్ద తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
    May 12, 2018, 10:48 am IST

    'మేము ఓటేశాం.. మీరు వేశారా?' అని అనిల్ కుంబ్లే ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో ఆయన కుటుంబం ఓటు హక్కు వినియోగించుకుంది.
    May 12, 2018, 10:03 am IST

    'మేము చాలా నమ్మకంగా ఉన్నాం. బీజేపీ చెబుతున్న 150 సంగతి మరిచిపోండి, వాళ్లకి 60-70కి మించి సీట్లు రావు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కలలు కంటున్నారు' కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే అభిప్రాయపడ్డారు.
    May 12, 2018, 9:56 am IST

    జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.డి దేవెగౌడ, ఆయన భార్య చెన్నమ్మ దేవేగౌడ, కొడుకు హెచ్.డి రేవన్న ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హోలెనర్సిపురలోని 244పోలింగ్ బూత్ వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు.
    May 12, 2018, 9:37 am IST

    కర్ణాటక ఎన్నికల్లో ఉదయం 9గం. వరకు 10.6శాతం పోలింగ్ నమోదైంది.
    May 12, 2018, 9:27 am IST

    కర్ణాటక మంత్రి కేజే జార్జ్ బెంగళూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సర్వజ్ఞనగర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.
    READ MORE

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+