Times Now exit polls: ఒకే ఒక్క సీటు ఆధిక్యతతో కర్ణాటకలో ఆ పార్టీదే అధికారం
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగింసింది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఆరంభమైంది. సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 65.69 మేర పోలంగ్ శాతం నమోదైనట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా వెల్లడించింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎన్నికల సిబ్బంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సీల్ వేశారు.
ఈ నెల 13వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపును షెడ్యూల్ అయింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఆరంభం అయ్యాయి. వివిధ న్యూస్ ఛానళ్లు ఇదివరకే తాము నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ క్రమంగా వెలువడిస్తోన్నాయి. ఈ ఎన్నికల్లో కన్నడిగులు ఏ పార్టీకి పట్టం కట్టారనే విషయంపై అంచనాలను విడుదల చేస్తోన్నాయి. ఈ నెల 13వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు అనంతరం- ఏ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనడంపై ప్రజాభిప్రాయాన్ని వెల్లడిస్తోన్నాయి.

టైమ్స్ నౌ- ఈటీజీ మార్క్ ప్రసారం చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీదే అధికారం. ఈ నెల 13వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభిస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 113 సీట్లు అవసరం కాగా.. ఈ సంఖ్య కంటే ఒకే ఒక్క సీటు ఆధిక్యతతో అంటే 114 స్థానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ-ఈటీజీ తెలిపింది.
బీజేపీకి 86 వరకు సీట్లు దక్కుతాయని తెలిపింది. జనతాదళ్ (సెక్యులర్) 23 స్థానాలకే పరిమితమౌతుందని పేర్కొంది. ఇతరులు మూడు స్థానాలను దక్కించుకోగలుగుతారని అంచనా వేసింది. సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్‌కు 17 సీట్లు లభిస్తాయని టైమ్స్ నౌ-ఈటీజీ అంచనా వేసింది. ఇదే రీజియన్‌లో బీజేపీ తొమ్మిది సీట్లను సాధిస్తుందని, జేడీఎస్ ఖాతా తెరవకపోవచ్చని తెలిపింది.

కోస్తా కర్ణాటక రీజియన్‌లో కర్ణాటక-16, కాంగ్రెస్-3 సీట్లను దక్కించుకుంటాయి. ఇక్కడ కూడా జేడీఎస్‌కు ఒక్క స్థానం కూడా లభించకపోవచ్చు. సెంట్రల్ కర్ణాటక, కోస్తా కర్ణాటక రీజియన్లల్లో లభించే సీట్లే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని నిర్ధారిస్తాయని టైమ్స్ నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.












Click it and Unblock the Notifications