Reddy: గాలి దెబ్బకు ఎవరికి తడిసిపోతుంది ?, ఎవరి లెక్కలు వాళ్లవే. కింగ్ మేకర్ ఎవరు ?
బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటకలో కొన్ని నెలల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మేమే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ సైతం ఈసారి ప్రభుత్వం మాదే అని బల్లగుద్ది చెబుతోంది. ఇక ఏదిఏమైనా కింగ్ మేకర్లు మేమే అని జేడీఎస్ అంటోంది. ఇలాంటి సమయంలో కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడంతో కథ రసవత్తరంగా మారిపోయింది. గాలి జనార్దన్ రెడ్డి దెబ్బకు బీజేపీకి సినిమా కనపడుతుందని కొందరు అంటున్నారు. అయితే కర్ణాటక సీఎంతో సహ బీజేపీ నాయకులు మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి గురించి సీనియర్ మంత్రి ఆసక్తికరంగా మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

సింపుల్ గా తప్పించుకున్న సీఎం
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి వలన మాకు ఎలాంట నష్టం లేదని, గత శాసన సభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించి మెజారీసీట్లలో విజయం సాధించిందని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ విషయంలో నోకామెంట్ అని సింపుల్ గా తప్పించుకున్నారు.

మంత్రి అశ్వథ్ నారాయణ
దేశంలోని ప్రతి ఒక్కరికీ కొత్త రాజకీయ పార్టీని స్థాపించే హక్కు ఉందని, అయితే ఇది బీజేపీని ఏ విధంగానూ ప్రభావితం చేయదని కర్ణాటక రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సీఎన్. అశ్వత్ నారాయణ్ అన్నారు. కళ్యాణ రాజ్య ప్రగతి (కల్యాణ రాష్ట్ర ప్రగతి) అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన గాలి జనార్దన్ రెడ్డి విషయంలో మంత్రి అశ్వత్థ్ నారాయణ ఈవిధంగా మాట్లాడారు. కళ్యాణ రాష్ట్ర ప్రగతి పార్టీ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి అశ్వథ్ నారాయణ అన్నారు.

సేమ్ డైలాగ్ రిపీట్
ఇది ప్రజాస్వామ్య దేశమని, ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలు పెట్టుకునే అవకాశం ఉందని, అదే తరహాలో గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీని స్థాపించారని మంత్రి అశ్వథ్ నారాయణ అన్నారు. కొత్త పార్టీ ప్రకటించిన రోజు తన పార్టీ భవిష్యత్తును ప్రజలు నిర్ణయిస్తారని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మీడియా ముందు చెప్పారు. కర్ణాటకలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో గంగావతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గాలి జనార్దన్ రెడ్డి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొత్త పార్టీ ప్రకటనతో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు.

ఆరోజు ఏం జరిగింది ?
కర్ణాటకలోని 10 అసెంబ్లీ స్థానాల్లో గాలి జనార్దన్ రెడ్డికి ప్రజల మద్దతు ఉందని బీజేపీ నాయకులే అంటున్నారు. 2023లో కర్ణాటకలో జరగనున్న 224 అసెంబ్లీ ఎన్నికల్లో ఇది బీజేపీకి గట్టి దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఎస్ యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2008లో అధికారంలోకి వచ్చిన సమయంలో గాలి జనార్ధనరెడ్డి తొలిసారిగా క్యాబినేట్ మంత్రి అయ్యారు. అప్పటి నుంచి కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్దన్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు.

ఆపరేషన్ కమలా తో అధికారంలోకి వచ్చిన బీజేపీ
2018లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ మెజారిటీ లేక అధికారానికి బీజేపీ దూరమైంది. కాంగ్రెస్ 78 సీట్లు గెలుచుకోగా, జేడీఎస్ 37 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌తో జేడీఎస్ పొత్తు పెట్టుకోవడంతో మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ కుమారుడు హెచ్‌డీ. కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఏడాది తర్వాత కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన బీఎస్ యడియూరప్ప ఆపరేషన్ కమలా అంటూ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆరోజు ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం యడియూరప్ప రాజీనామా చేసిన బసవరాజ్ బోమ్మయ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

ఎవరికి లాభం ?, ఎవరికి నష్టం
గాలి జనార్దర్ రెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టడంతో వచ్చే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మీద పెద్దగా ప్రభావం ఉండదని కొందరు బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి సందర్శించలేరు. హైదరాబాద్ కర్నాటక ప్రాంతంలో రెడ్డి కులం పెద్దగా లేకపోవడంతో స్థానికంగా ఉంటున్న ఇతర కులాలు గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీని ఆదరించరని కొందరు నాయకులు అంటున్నారు. సుప్రీం కోర్టు ఆంక్షలు కూడా గాలి జనార్దన్ రెడ్డికి మైనస్ అవుతోందని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు.

కొన్ని నెలలు మాత్రమే ?
కొన్ని నెలల్లో కర్ణాటకలో జరిగే శాసన సభ ఎన్నికల ప్రచారానికి బళ్లారి జిల్లాకు రావడానికి కోర్టు అనుమతి తీసుకోవడంలో గాలి జనార్దన్ రెడ్డి విజయం సాధిస్తారా ? అనే వియం ఎవ్వరూ చెప్పలేరు. కర్ణాటక రవాణా శాఖ మంత్రి, గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు బి. శ్రీరాములు దూరం అయితే వాల్మీకి కులాలకు చెందిన బలమైన నాయకులు మాకు లేరని బళ్లారికి చెందిన ఓ బీజేపీ సీనియర్ నాయకుడు అంటున్నారని కన్నడ మీడియా అంటోంది. మొత్తం మీద కొత్త రాజకీయ పార్టీ పెట్టిన గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక రాజకీయాలను ఇప్పటి నుంచి ఓ కుదుపుకుదిపేస్తున్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications