ఇండియా టుడే - యాక్సి మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు: కర్నాటకలో కాంగ్రెస్‌కు 118, బీజేపీకి 92
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. సమయం దాటిన తర్వాత క్యూలో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న కర్నాటక ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఓటింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్‌పై అందరి దృష్టి పడింది. ఎన్నికల నియమ నిబంధనల మేరకు ఓటింగ్ సమయం పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయకూడదు. ఈ నేపథ్యంలో ఓటింగ్ పూర్తయ్యాక ఛానల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చాయి.

కర్నాటకలో సాయంత్రం 5 గంటల వరకు 64 శాతం పోలింగ్ జరిగింది. మొత్తంగా 70 శాతం దాటవచ్చు. సాయంత్రం వరకు రామనగరలో 84 శాతం, బెంగళూరు అర్బన్‌లో 44 శాతం ఓటింగ్ నమోదయింది.
ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఒకటి రం ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందంటే..
కాంగ్రెస్ పార్టీ - 106-118
భారతీయ జనతా పార్టీ - 79-92
జేడీఎస్ - 22-30
ఇతరులు - 1-4












Click it and Unblock the Notifications