బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటక తాత్కాలిక స్పీకర్ గా కేజీ బోపయ్య, బీజేపీ ఎమ్మెల్యే, ఐదేళ్ల అనుభవం, సీఎం ధీమా!

|
Google Oneindia TeluguNews

Recommended Video

వెనక్కి తగ్గని గవర్నర్.. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేత

బెంగళూరు: కర్ణాటక శాసన సభ తాత్కాలిక స్పీకర్ గా బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కేజీ. బోపయ్యను నియమించారు. వీరాజపేట శాసన సభ్యుడు కేజీ బోపయ్యను విదాన సభ తాత్కాలిక స్పీకర్ గా శిఫారస్సు చేస్తూ శాసన సభ కార్యదర్శి గవర్నర్ వాజుబాయ్ వాలాకు లేఖ రాశారు.

గవర్నర్ ఓకే

గవర్నర్ ఓకే

కర్ణాటక శాసన సభ కార్యదర్శి శిఫారస్సు లేఖను పరిశీలించి గవర్నర్ వాజుబాయ్ వాలా శుక్రవారం అమోదముద్ర వేశారు. కర్ణాటక శాసన సభ తాత్కాలిక స్పీకర్ గా కేజీ. బోపయ్యను నియమించారు. 2008 నుంచి 2013 వరకూ కేజీ. బోపయ్య కర్ణాటక శాసన సభ స్పీకర్ గా పని చేశారు.

యడ్యూరప్ప ధీమా

యడ్యూరప్ప ధీమా

ఐదు సంవత్సరాలు స్పీకర్ గా పని చేసిన అనుభవంతో శనివారం సాయంత్రం 4 గంటలకు విదాన సౌధలో ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప బలపరీక్షను తాత్కాలిక స్పీకర్ బోపయ్య సమర్థవంతంగా నిర్వహిస్తారని అందరూ భావిస్తున్నారు. కేజీ బోపయ్య నియమాకంతో సీఎం యడ్యూరప్ప ధీమాగా ఉన్నారు.

 ప్రమాణస్వీకారం

ప్రమాణస్వీకారం

గవర్నర్ వాజుబాయ్ వాలా శుక్రవారం కేజీ. బోపయ్యతో తాత్కాలిక స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేయించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్ వీ. దేశ్ పాండే, బీజేపీ నుంచి ఉమేష్ కత్తిని తాత్కాలిక స్పీకర్ చెయ్యాలని ఆ పార్టీల నాయకులు భావించారు. అయితే చివరికి కేజీ బోపయ్య ఆసీటులో కుర్చున్నారు.

నో కామెంట్

నో కామెంట్

కేజీ. బోపయ్య స్పీకర్ గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన్ను నియమిస్తూ గవర్నర్ వాజుబాయ్ వాలా నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తాత్కాలిక స్పీకర్ గా కేజీ బోపయ్యను నియమించడంపై ఇంకా ఏ విధంగాను స్పందించలేదు. బీజేపీ ఎమ్మెల్యే అయిన కేజీ. బోపయ్య శనివారం బలపరీక్ష సమయంలో ఎలా వ్యవహరిస్తారో వేచిచూడాలి.

English summary
Karnataka Politics: Governor Vajubhai Vala appointed KG Bopaiah as the pro-term speaker as per the recommendation of the Secretary of Legislature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X